అధికారులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు

Pension for children whose parents are dead

రాష్ట్రంలో భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నెల్లూరు సహా పలు జిల్లాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదించాలని సూచించారు.

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై కనిపిస్తోంది. నిన్నటి నుంచి రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా ముసురు మొదలైంది. వాయుగుండం రేపు తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో మరో రెండు రోజుల వరకు తెలంగాణలోనూ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఇటు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటొచ్చని అంచనా వేసింది. నెల్లూరు, ప్రకాశం, వైస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలకు ఆస్కారం ఉందని హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Retirement from test cricket. On lakkom waterfalls : a spectacular cascade in the munnar hills.