దీపావళి నుండి మహిళలకు ఫ్రీ బస్ – గురజాల జగన్ మోహన్

free bus ap

దీపావళి మరుసటి రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. మరికొన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ దీపావళికి (అక్టోబర్ 31) ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. తాము ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్పారు. ఏపీలో చాలారోజులుగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారనే చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఈ పథకం పై కీలక ప్రకటన చేశారు. జిల్లాలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంకా పెన్షన్లు పెంచాలి. రేషన్‌ కార్డులు ఇవ్వాలి. ఎన్టీఆర్‌ గృహాలు ఇవ్వాలి. ఇంకా ఎన్నో ఇవ్వాలని వచ్చామని అన్నారు. ప్రభుత్వం ఈ దీపావళి పండుగకు ఉచిత సిలిండర్‌ పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. అలాగే దీపావళి మరుసటి రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Latest sport news. Mushroom ki sabji : 5 delicious indian mushroom recipes brilliant hub.