రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో రాష్ట్రంలోని పలు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు యాజమాన్యాలు తాళం వేశారని హరీష్ రావు ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అధ్వానస్థితికి చేరుకుంది. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న CM విద్యా వ్యవస్థ గురించి ఇంకెప్పుడు పట్టించుకుంటారు? అద్దెలు ఎప్పుడు చెల్లిస్తారు’ అని ప్రశ్నించారు.
దసరా సెలవుల తర్వాత పాఠశాలకు వచ్చిన విద్యార్థులు తాళం వేసిన పాఠశాలాలు చూసి షాక్ అయ్యారు. అందులో చదువుకుంటున్న విద్యార్థులు గందరగోళంలో పడిపోయారు. విద్య కోల్పోవడమే కాకుండా, వారు సాధారణ విద్యా ప్రవాహం నుంచి దూరం కావాల్సి వస్తుందని , పాఠశాలకు తాళం వేయడం వల్ల మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఈ పాఠశాలలు ఎక్కువగా ఆర్థికంగా వెనుకబడిన మైనార్టీ విద్యార్థులు చదువు కుంటున్నారని వాపోయారు. ప్రభుత్వ స్థాయిలో పాఠశాలల నిర్వహణకు సంబంధించిన సమస్యలు ఎదురవుతుంటే, విద్యా రంగంలో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ ఘటన పట్ల ప్రజల ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించవలసిన అవసరం ఉందని , అద్దె చెల్లింపులు తక్షణమే విడుదల చేయాలనీ, తద్వారా విద్యార్థులపై పడుతున్న ఒత్తిడి తక్కువ అవుతుందని అంటున్నారు. మైనార్టీ విద్యార్థులకు విద్యకు సంబంధించిన సమస్యలు ఎదురైతే, అది వారి అభివృద్ధికి పెద్ద ఆటంకంగా మారుతుంది. ప్రభుత్వం వీరికి ప్రాధాన్యం ఇచ్చి విద్యను నిరాటంకంగా అందించాల్సిన బాధ్యత ఉంది.