‘వాళై’ (హాట్ స్టార్) మూవీ రివ్యూ!

vaazhai2

వాళై సినిమా పేద గ్రామీణ కుటుంబాల కథను ఆధారంగా చేసుకుని మనసును హత్తుకునే విధంగా రూపొందిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్. ఇటీవలి కాలంలో పిల్లలు ప్రధాన పాత్రలుగా ఉండే గ్రామీణ నేపథ్యం ఉన్న కథలు ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అదే తరహాలో, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన “వాళై” సినిమా కూడా గ్రామీణ జీవితాలను, పేదరికాన్ని, పిల్లల సవాళ్లను అద్భుతంగా చూపిస్తుంది.
సినిమా కథ తమిళనాడులోని మారుమూల గ్రామంలో ఉంటే 12 ఏళ్ల కుర్రాడు శివనంద చుట్టూ తిరుగుతుంది. అతని కుటుంబం తల్లి, పెళ్లి కావలసిన అక్కతో మాత్రమే పరిమితమై ఉంటుంది. శివనందకు స్కూల్ అంటే చాలా ఇష్టం, చదువు మీద అతని ఆసక్తి ఎంతో గొప్పది. తన క్లాస్‌లో ఫస్టుగా ఉండే శివను టీచర్లు చాలా ఇష్టపడతారు, పూన్ గుడి టీచర్ (నిఖిలా విమల్) అయితే అతనికి ప్రియమైన గురువు.

అరటితోటల జీవనం.
ఆ గ్రామంలో చాలా మంది కూలీలుగా పని చేస్తూ జీవనాన్ని సాగిస్తుంటారు. అరటితోటలకు సంబంధించిన పనులు వారి జీవనాధారంగా ఉంటాయి. శివనంద కూడా తన తల్లి ఒత్తిడితో స్కూల్‌ని వదిలి కూలీ పనికి వెళ్లడం ప్రారంభిస్తాడు. అయితే, అతనికి చదువు మీద ఉండే అభిరుచి వల్ల ఎప్పుడూ స్కూల్‌కి వెళ్లాలనే తపన ఉంటుంది.

కథలో కీలక మలుపు, శివనంద తల్లి అనారోగ్యానికి గురయ్యాక వస్తుంది. ఆ రోజు శివ స్కూల్‌కి డాన్స్ రిహార్సల్‌కి వెళ్లాలనుకుంటాడు, కానీ తన తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇంటిలో పనులు చేయాల్సిన అవసరం వస్తుంది. అయితే, శివ అక్కయ్యతో పనికి వెళ్లించడంతో ఒక పెద్ద సమస్య వస్తుంది, ఆ సన్నివేశం కథను కొత్త మలుపు తీసుకొస్తుంది.

సినిమా స్పెషాలిటీ
“వాళై” కథ 1990లలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందినదని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ద్వారా పేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంట్రాక్టర్ల ధోరణి, పిల్లల చదువుకి ఏర్పడుతున్న అవరోధాలను చర్చిస్తున్నారు. చదువుకు దూరమవుతున్న పిల్లల పరిస్థితులను, కూలీల జీవితాలను చాలా సహజంగా తెరపై చూపించారు.

ఈ చిత్రం ఆహ్లాదకరమైన వినోదాన్ని ఆశించే ప్రేక్షకులకు కాకుండా, గాఢమైన భావోద్వేగాలను పంచే ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందినదిగా గుర్తించాలి. దర్శకుడు, ఆ సంఘటనను చాలా సహజంగా తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. చివర్లో కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు.

సినిమాటోగ్రఫీ మరియు సంగీతం
సినిమాలో చూపించిన గ్రామీణ వాతావరణం, పచ్చని పొలాలు, అరటితోటలు, మరియు సహజసిద్ధ ప్రకృతిని చూపించిన విధానం ప్రేక్షకులను ఆహ్లాదపరుస్తుంది. కెమెరా పనితనం, సంగీతం కూడా చాలా గొప్పగా పని చేశాయి. సంతోష్ నారాయణ్ ఇచ్చిన నేపథ్య సంగీతం, సూర్య ప్రథమన్ ఎడిటింగ్ సినిమాకు మరింత బలం చేకూర్చాయి.

సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన నటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రత్యేకించి శివనంద పాత్రలో నటించిన బాలుడి పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు.
ఈ కథ సమాజంలో పేదరికంతో బాధపడుతున్న కుటుంబాలు, చదువుకి దూరమవుతున్న పిల్లలు, మరియు వారిని అర్థంచేసుకోకపోవడం వల్ల కలిగే పరిణామాలను ఎంతో సమర్థంగా చూపిస్తుంది. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాకుండా, కొంతమంది జీవితాలను ప్రతిబింబిస్తుందనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది.

“వాళై” సినిమా జీవితపు వాస్తవాలను, ఆలోచనలను ప్రభావవంతంగా తెరపైకి తీసుకురావడంతో, ఆ కంటెంట్ ప్రేక్షకులను కదిలిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. Baby bооmеrѕ, tаkе it from a 91 уеаr оld : a lоng lіfе wіth рооrеr hеаlth іѕ bаd nеwѕ, аnd unnесеѕѕаrу. Chinese ambitions for us allies prompts washington security summit with japan, philippines.