దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ వేకువజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ తెల్లవారుజాము 4 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది, దీనివల్ల తిరుమాడ వీధులు నీటితో నిండిపోయాయి.
తిరుమలలో కురుస్తున్న భారీ వర్షం భక్తులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. భారీగా వర్షం పడుతున్న నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అదనపు కార్యనిర్వాహణ అధికారి (ఈవో) వెంకయ్య చౌదరి స్పందిస్తూ, భక్తులను రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. “భక్తులు వర్షంలో తడిచిపోవద్దని, వీలైనంత త్వరగా షెడ్లు ఖాళీ చేసిన వెంటనే లోపలికి తరలిస్తామని” ఆయన అన్నారు.
భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.