Liquor shops lottery today in AP

ఏపీలో నేడే మద్యం షాపుల కోసం లాటరీ

అమరావతి: ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా, 89,882 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.1797.64కోట్ల ఆదాయం వచ్చింది.

Advertisements

అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రావడంతో వాటిని పునః పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని 113 మద్యం దుకాణాలకు అత్యధికంగా 5,764 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు.

కాగా, ఏపీలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు లాటరీ పధ్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్నారు. దీంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 15న (రేపు) ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించనున్నారు. దీంతో 16వ తేదీ నుండి రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వస్తుంది.

Related Posts
స్టీఫెన్ హాకింగ్ జయంతి: విజ్ఞానానికి అంకితమైన జీవితం
స్టీఫెన్ హాకింగ్ జయంతి: విజ్ఞానానికి అంకితమైన జీవితం

స్టీఫెన్ హాకింగ్ పూర్తి పేరు స్టీఫెన్ విలియం హాకింగ్, ఆయన ఒక ప్రఖ్యాత విశ్వ శాస్త్రవేత్త, ఆంగ్ల సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త మరియు రచయిత. ఆయన కేంబ్రిడ్జ్ Read more

CM Chandrababu : బాబు జగ్జీవన్ రామ్‌కి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu pays tribute to Babu Jagjivan Ram

CM Chandrababu : భారత మాజీ ఉప రాష్ట్రపతి డా. బాబూ జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. భారతదేశ Read more

IPL 2025 :సంజు శాంసన్​కు జరిమానా విధించిన ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ
IPL 2025: మ్యాచ్ ఓటమిపై స్పందించిన సంజు శాంసన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్ 58 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. అయితే Read more

తిరుమల విజన్ 2047
తిరుమల విజన్ 2047

చంద్రబాబు నాయుడు స్వర్ణ ఆంధ్రా విజన్ కి అనుగుణంగా TTD "తిరుమల విజన్ 2047" తిరుమల తిరుపతి దేవస్థానము (TTD) "తిరుమల విజన్" ప్రారంభించారు, ఇది ఆంధ్రప్రదేశ్ Read more

×