ఈనెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రామ సభల్లో ఆమోదించిన పనులను పల్లె పండుగ సందర్భంగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 4500 కోట్ల నిధులను కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిందని, గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలుపెట్టాలని సూచించారు. 3000kms మేర సీసీ రోడ్లు, 500 kms మేర తారు రోడ్లు వేయాలన్నారు.
మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.. రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. వివిధ జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడుతూ, ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ర్టంలోని పంచాయతీల్లో నిర్వహించే ‘పల్లె పండుగ’ కార్యక్రమంపై కీలక సూచనలు చేశారు.. అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రతి పంచాయతీలో అభివృద్ధి పనులను మొదలుపెట్టాలని అధికారులను గతంలోనే ఆదేశించారు.