వెనుకంజ‌లో కాంగ్రెస్‌..లీడింగ్‌లో బీజేపీ అభ్య‌ర్థి..కౌటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన వినేశ్ పోగ‌ట్‌

Congress candidate from Julana Vinesh Phogat leaves from a counting center

న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు సందర్భంగా హర్యానాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. కౌటింగ్ కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.చేదు ఫలితాలు ఎదురవుతోన్నాయి. మొదట్లో సాధించిన భారీ ఆధిక్యత కాస్తా కొట్టుకుపోయింది. వెనుకంజలో పడింది.

ఇటీవలే జమ్మూ కాశ్మీర్, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. కాశ్మీర్‌లో మూడు దశల్లో హర్యానాలో ఈ నెల 5వ తేదీన ఒకే విడతలో 90 చొప్పున నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. తాజాగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది.

ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే తొలి గంటలో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ- దూసుకెళ్లింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేేసే దిశగా అడుగులు వేసింది. తొలి గంటలోనే భారీ మెజారిటీని సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మొత్తం 71 నియోజకవర్గాల్లో ఆధిక్యతలో కొనసాగారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తెరిచిన తరువాత ఫలితాలు తారుమారు అయ్యాయి. బీజేపీ ఒక్క ఉదుటున ఆధిక్యతను సాధించింది. ఈవీఎంలల్లో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్ ఆధిక్యత భారీగా తగ్గుతూ వచ్చింది. వెనుకంజలో నిలిచింది. పోటీ ఇవ్వలేని స్థితిలో కనిపించిన బీజేపీ ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది.

ఉదయం 11 గంటల సమయానికి బీజేపీ 48 నియోజకవర్గాల్లో ఆధిక్యతలో నిలిచింది. కాంగ్రెస్ ఆధిక్యత 71 నుంచి 36కు పడిపోయింది. ఇండిపెండెంట్లు నాలుగు చోట్ల, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, బహుజన్ సమాజ్‌వాది పార్టీ అభ్యర్థులు ఒక్కో సీటులో లీడింగ్‌లో కనిపించారు. జన్‌నాయక్ జనతా పార్టీ ఖాతా తెరవలేకపోయింది. జులానా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ సైతం వెనుకంజలో నిలిచారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన కేప్టెన్ యోగేష్ బైరాగిపై 2,128 ఓట్ల తేడాతో వెనుకపడ్డారు. ప్రతి రౌండ్‌కూ యోగేష్ బైరాగి ఆధిక్యత పెరుగుతోండటంతో ఆమె ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటికి వెళ్లిపోయారు.

ఈ సందర్భంగా ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడటానికి నిరాకరించారు. రాజకీయాల గురించి ప్రస్తావించగా సమాధానం ఇవ్వలేదు. స్థానికులు ఆమెతో సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు. వారిని నిరాశపర్చలేదు వినేష్ ఫొగట్. వారితో కలిసి చిరునవ్వుతో సెల్ఫీ దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Life und business coaching in wien – tobias judmaier, msc. Latest sport news.