షాంఘై సదస్సు.. భారత్‌తో ద్వైపాక్షిక చర్చలు ఉండవ్ : పాకిస్తాన్

Pakistan rules out bilateral talks with India during Jaishankars visit

న్యూఢిల్లీ : ఇస్లామాబాద్ వేదికగా అక్టోబర్ 15-16 మధ్య షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సు జరగనున్న నేపథ్యంలో ఆతిథ్య దేశం పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ పాక్ పర్యటన సందర్భంగా భారత్‌తో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు ఉండబోవని స్పష్టం చేసింది. చర్చలకు అవకాశం లేదని తెలిపింది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

జైశంకర్ పర్యటన, భారత్-పాకిస్థాన్ సంబంధాలపై మీడియా ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ‘‘భారత బృందం పర్యటనకు సంబంధించి పాకిస్థాన్ స్పష్టమైన విధానంతో ఉంది. సభ్యులందరినీ స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాలకు సంబంధించిన మీ ప్రశ్నకు అక్టోబర్ 5న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించాలనుకుంటున్నాను. నా పర్యటన పాక్షిక కార్యక్రమమని జైశంకర్ చెప్పారు. పాకిస్థాన్‌తో చర్చల కోసం కాదన్నారు. ఈ వ్యాఖ్యలు వివరణాత్మకమైనవి’’ అని ముంతాజ్ జహ్రా బలోచ్ ప్రస్తావించారు.

కాగా, ఇస్లామాబాద్‌లో జరిగే ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు వెళ్లనున్న భారత బృందానికి విదేశాంగమంత్రి జైశంకర్ నేతృత్వం వహిస్తారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Low time commitment business ideas for earning extra income from home biznesnetwork. Por fim, o acompanhamento contínuo é uma estratégia essencial para prevenir recaídas. © 2013 2024 cinemagene.