చంద్రబాబు ను కలిసిన బిఆర్ఎస్ నేతలు

మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డిలు ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్బంగా తీగల..తాను టిడిపిలో చేరబోతున్నట్లు తెలిపాడు. సోమవారం జూబ్లీహిల్స్ లోని చంద్ర‌బాబు నివాసంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. అలాగే ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు సైతం ఉన్నారు.

ఈ సందర్బంగా తీగల తాను టీడీపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఆయ‌న బీఆర్ఎస్ పార్టీలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్‌తో త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైంద‌ని గుర్తు చేసిన ఆయ‌న‌… హైద‌రాబాద్ అభివృద్ధి చేసింది వంద‌కు వంద‌శాతం చంద్ర‌బాబేన‌ని అన్నారు. తెలంగాణ‌లో టీడీపీ పాల‌న మ‌ళ్లీ రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు.

ఇక చంద్ర‌బాబును క‌లిసిన మ‌ల్లారెడ్డి త‌న‌ మ‌న‌వ‌రాలు శ్రేయ‌రెడ్డి పెళ్లికి సీఎంను ఆహ్వానించారు. గ‌తంలో మ‌ల్లారెడ్డి, మాధ‌వ‌రం కృష్ణారావు, తీగ‌ల కృష్ణారెడ్డి టీడీపీలో ప‌నిచేసిన విష‌యం తెలిసిందే. కానీ, ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో టీడీపీని వీడారు. మ‌ల్లారెడ్డి మ‌న‌వ‌రాలు పెళ్లి కార‌ణంగా చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు టీడీపీ అధినేత‌ను క‌లిశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *