రాహుల్ గాంధీకి పూణే కోర్టు సమన్లు జారీ

124

న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కి పూణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ పై రాహుల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సావర్కర్‌ మనవడు సత్యకి సావర్కర్‌ పూణె కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

ప్రతి సందర్భంలోనూ సావర్కర్‌ను అవమాన పరిచేలా రాహుల్‌ విమర్శలు చేస్తున్నారని సత్యకి ఆరోపించారు. ఈ కేసు గత నెలలో జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు రాహుల్‌కు సమన్లు పంపింది. అక్టోబర్‌ 23న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.

ఈ కేసును గత నెలలో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (జేఎంఎఫ్‌సీ) కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. ప్రత్యేక న్యాయస్థానం జాయింట్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) అమోల్ షిండే అధ్యక్షత వహిస్తారు. సత్య సావర్కర్ తరపున న్యాయవాది సంగ్రామ్ కోల్హత్కర్ పీటీఐతో మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ ఆరోపణలకు వ్యతిరేకంగా సమన్లు ​​జారీ చేసినట్లు తెలిపారు. పరువు నష్టంపై భారత శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 500 ప్రకారం ఆయన సమాధానం చెప్పడానికి హాజరుకావాల్సిన అవసరం ఉన్నందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Entwickelt sich im wahrnehmen des partners so wie dieser oder diese wirklich ist und das braucht zeit. Latest sport news.