Deputy CM gave declaration to Tirumala along with daughters

కూతుళ్ల‌తో క‌లిసి తిరుమ‌లకు పవన్‌..డిక్ల‌రేష‌న్ ఇచ్చిన డిప్యూటీ సీఎం

Deputy CM gave declaration to Tirumala along with daughters.

తిరుమల: తిరుమ‌ల శ్రీవారి ప్ర‌స్తాదం ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారం నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ 11 రోజుల పాటు ప్రాశ్చిత్త దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈరోజు ఆయ‌న శ్రీవారిని ద‌ర్శించుకుని దీక్ష‌ను విర‌మించ‌నున్నారు. ఇక మంగ‌ళ‌వారం రాత్రి అలిపిరి మెట్ల మార్గంలో కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు చేరుకున్నారు. నేటి ఉద‌యం స్వామివారిని ద‌ర్శించుకునేందుకు పెద్ద కుమార్తె ఆద్య‌, చిన్న కూత‌రు పొలెనా అంజ‌ని కొణిదెల‌తో క‌లిసి వెళ్లారు. ఈ క్ర‌మంలోనే అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది.

ప‌వ‌న్ చిన్న కుమార్తె క్రిస్టియ‌న్ కావ‌డంతో టీటీడీ అధికారులు డిక్ల‌రేష‌న్‌పై సంత‌కాలు తీసుకున్నారు. ఆమె మైన‌ర్ కావ‌డంతో తండ్రిగా ప‌వ‌న్ కూడా ఆ ప‌త్రాల‌పై సంత‌కం చేశారు. కాగా, రాష్ట్రంలో డిక్ల‌రేష‌న్ విష‌య‌మై వివాదం నెలకొన్న వేళ జ‌న‌సేనాని చేసిన ప‌నితో ఒక విధంగా ఆ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టిన‌ట్లైంది. ఇక స్వామివారి ద‌ర్శ‌నం అనంత‌రం ప‌వ‌న్ కల్యాణ్ నేరు తరిగొండ అన్న‌ప్ర‌సాద స‌ముదాయానికి చేరుకోనున్నారు. అక్క‌డ భక్తుల‌కు అందుతున్న సౌక‌ర్యాల‌ను డిప్యూటీ సీఎం ప‌రిశీలించ‌నున్నారు. అలాగే భ‌క్తుల‌తో క‌లిసి సహ‌పంక్తి భోజ‌నం కూడా చేస్తార‌ని తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత ప‌వ‌న్‌-అన్నా లెజ్నెవా కూతురు క‌నిపించ‌డంతో ఆయ‌న అభిమానులు ఆ ఫొటోల‌ను తెగ షేర్ చేస్తున్నారు. దీంతో ప‌వ‌న్ చిన్న కూతురు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda. The easy diy power plan uses the. India vs west indies 2023 archives | swiftsportx.