ఈ ఏడాది వర్షాకాలంలో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. ఈ వర్షాల కారణంగా 1492మంది కన్నుమూశారని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీరిలో 895మంది వరదల్లో, 597మంది పిడుగుపాటు వలన మరణించినట్లు పేర్కొంది. అత్యధికంగా కేరళలో 397మంది అసువులు బాసినట్లు వెల్లడించింది. ఇక ఈ ఏడాది వర్షపాతం గడచిన ఐదేళ్లలో అత్యధికమని IMD వివరించింది.