ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి 70 గంటలు పని చేయాలనే సూచనతో పని గంటలపై చర్చ మొదలైంది. దీని తరువాత, ఇటీవల L&T చైర్మన్ SN సుబ్రమణియన్ వారానికి 90 గంటలు పని చేయాలని, ఆదివారం సెలవు తీసుకోవద్దని సూచించారు. మీ భార్యను ఇంట్లో ఎంతసేపు చూడగలరు అంటూ అన్నారు. దింతో ఈ చర్చ కొత్త వివాదానికి దారితీసింది. ఈ తరుణంలోనే ఆనంద్ మహీంద్రా ఈ మాటలను పరోక్షంగా తిప్పికొట్టారు. అంతేకాదు దీనికి సంబంధించి బాలీవుడ్ హీరోయిన్ దీపిక పాడుకొనే కూడా స్పందించారు. షార్క్ ట్యాంక్ ఇండియా న్యాయమూర్తి ఇది మాత్రమే కాదు, షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జి అనుపమ్ మిట్టల్ L&T ఛైర్మన్ SN సుబ్రమణియన్ ప్రకటనపై విరుచుకుపడ్డారు. “సార్, భార్యాభర్తలు ఒకరినొకరు చూడకపోతే, మనం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఎలా ఉంటాము?” అంటూ ట్వీట్ చేసారు.

దేశంలో పని గంటలపై జరుగుతున్న చర్చల్లో భాగంలో ఇప్పుడు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా కూడా వచ్చి చేరారు. సోషల్ మీడియాలో చేసిన ట్వీట్‌లో పూనావాలా వర్క్ క్వాలిటీ అండ్ లైఫ్ బ్యాలెన్స్ పై ఉద్ఘాటించారు. అదార్ పూనావాలా చేసిన ట్వీటులో “అవును ఆనంద్ మహీంద్రా జీ, నా భార్య నటాషా పూనావాలా కూడా నన్ను అద్భుతంగా భావిస్తుంది. ఆమె ఆదివారం కూడా నన్నే చూస్తుంటుంది. ఎల్లప్పుడూ పని నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వండి, పరిమాణానికి కాదు అని అన్నారు.
అదర్ పూనావాలా చేసిన ఈ ట్వీట్ ఆనంద్ మహీంద్రా ప్రకటనకు రిప్లయ్ గా వచ్చింది, ఇందులో సైజ్ కంటే పని నాణ్యత ముఖ్యమని మహీంద్రా పేర్కొన్నారు. 10 గంటల్లో కూడా ప్రపంచాన్ని మార్చేయవచ్చని మహీంద్రా పేర్కొన్నారు. కుటుంబం ఇంకా మీ కోసం మీకు సమయం లేకపోతే, మీరు మంచి నిర్ణయాలు తీసుకోలేరని చెప్పాడు.