Telangana Thalli Statue to

9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

హైదరాబాద్ : ప్రస్తుతం ఉన్న విగ్రహం రూపాన్ని మారుస్తూ.. కొత్త విగ్రహాన్ని ఈనెల 9వ తేదీన ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. పాత తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ తల్లి జరీ అంచు పట్టు చీర ధరించగా.. కొత్త విగ్రహంలో పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర ధరించి ఉంది. పాత విగ్రహంలో తలకు కిరీటం, చేతిలో బతుకమ్మ ఉండగా.. కొత్త విగ్రహంలో కిరీటం, చేతిలో బతుకమ్మ లేదు. గత విగ్రహంలో తెలంగాణ తల్లి చేతికి బంగారు గాజులు ఉండగా, ప్రస్తుతం మట్టి గాజులు ధరించి తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తోంది. గత విగ్రహం రాజమాతలా ఉందనే విమర్శలు రాగా.. కొత్త విగ్రహం సాధారణ మహిళ రూపాన్ని తలపిస్తోంది. పాత విగ్రహంలో వెండి మెట్టెలు, నగలు కిరీటం ఉండగా.. కొత్త విగ్రహంలో మెడలో కంటి ఆభరణం మాత్రమే కనిపిస్తోంది. పాత విగ్రహంలో కుడి చేతిలో మక్క కంకులు ఉండగా.. కొత్త విగ్రహం కుడి చేతిలో అభయ హస్తం కనిపిస్తోంది. పాత విగ్రహంలో ఎడమ చేతిలో బతుకమ్మ ఉండగా.. కొత్త విగ్రహంలో ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. రెండు విగ్రహాల రూపాలకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది.

Advertisements

ఓ సాధారణ మహిళలా తెలంగాణ తల్లిని రూపొందిస్తున్నామని కాంగ్రెస్ చెబుతుండగా.. తెలంగాణ తల్లి రూపం ధనిక మహిళగా ఉంటే వచ్చే నష్టం ఏమిటని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది. మరో మూడు రోజుల్లో కొత్త తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో కొత్త విగ్రహానికి సంబంధించిన రూపం బయటకు వచ్చింది. ఓ సాధారణ మహిళను తలపించేలా విగ్రహం ఉండగా.. గత విగ్రహానికి ప్రస్తుత విగ్రహానికి పోలికల్లో ఎన్నో తేడాలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహం రూపాలను మార్చడం సరికాదని బీజేపీ అంటోంది. ఇటీవల తెలంగాణ గేయం విషయంలోనూ వివాదం నెలకొన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పాత గేయం స్థానంలో కొత్త గేయాన్ని తీసుకొచ్చింది. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం గత రూపాన్ని మారుస్తూ ఓ సాధారణ మహిళ రూపాన్ని తలపించేలా కొత్త రూపాన్ని రూపొందించింది. కాగా కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, దీనిలో భాగంగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తోందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది.

Related Posts
Pasala Krishna Bharati : ప్రముఖ గాంధేయవాది కన్నుమూసిన పసల కృష్ణభారతి
Pasala Krishna Bharati ప్రముఖ గాంధేయవాది కన్నుమూసిన పసల కృష్ణభారతి

Pasala Krishna Bharati : ప్రముఖ గాంధేయవాది కన్నుమూసిన పసల కృష్ణభారతి ప్రముఖ గాంధేయవాది పసల కృష్ణభారతి ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.ఆమె 92 సంవత్సరాల వయసులో Read more

ఛాంపియన్స్ ట్రోఫీని టార్గెట్ చేసిన పాక్ టెర్రరిస్టు..?
ICC Champions Trophy 2025

పాకిస్థాన్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP), ISIS, Read more

వర్మ పై వరుస కేసులు..తప్పించుకోవడం కష్టమే
varma cases

గత వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకొని రెచ్చిపోయిన వారు ..ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..వైసీపీ అధికారంలో ఉన్న టైములో టిడిపి , జనసేన Read more

పెళ్లి చీరతోనే గ్రూప్‌-2 మెయిన్స్ కు హాజరైన వధువు
Bride With Wedding Dress To

ఏపీలో వివాదాలు, నిరసనల నడుమ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతుండగా, 92,250 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దీనికోసం Read more

Advertisements
×