ఆగస్టు 15 నుంచి ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు (Free bus for women) ప్రయాణాన్ని అమలు చేయనుంది. ఈ నిర్ణయం కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.ఆర్‌టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు (RTC MD Dwaraka Tirumala Rao) ఈ పథకంపై తాజా వివరాలు వెల్లడించారు. ఆయన తిరుపతి జిల్లా వెంకటగిరి, వాకాడు బస్టాండ్లు, డిపోలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.వచ్చే నెల నుంచి మహిళలకు ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. అందుకోసం 11 వేల బస్సుల్లో 74 శాతం బస్సులను ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్టు తెలిపారు.

ఉమ్మడి జిల్లాలకు విస్తరణ
ఈ పథకాన్ని ప్రస్తుత జిల్లాలకు మాత్రమే కాకుండా ఉమ్మడి జిల్లాలకు కూడా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.రాబోయే రెండు నెలల్లో ప్రతి బస్టాండ్‌లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.ఆర్‌టీసీలోని అన్ని ర్యాంకుల ఉద్యోగులకు వచ్చే నెలాఖరులోగా పదోన్నతులు కల్పించనున్నట్టు ద్వారక తిరుమలరావు తెలిపారు.
కొత్త బస్సుల కేటాయింపు
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టీసీ డిపోలకు 1350 కొత్త బస్సులను కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 750 బస్సులు మంజూరు కాగా, మరో 600 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు.ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే ఈ పథకం విజయవంతంగా అమలు కావడానికి అధికారులు పకడ్బందీగా పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
Read Also : Chevireddy Bhaskar Reddy : చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు