తుమకూరు జిల్లా, కొరటగెరె మండలం (Tumkur District, Koratagere Mandal) లో ఒక భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. కోలాల గ్రామ సమీపంలోని రహదారి పక్కన ప్లాస్టిక్ సంచుల్లో ఓ మహిళ మృతదేహం భాగాలు (Body parts of a woman found in plastic bags) బయటపడ్డాయి. ఈ సంఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.ఆగస్టు 7న రహదారి వెంబడి ప్రయాణిస్తున్న వారు శరీర భాగాలతో నిండిన ఏడు సంచులను గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు.తరువాతి రోజు, అంటే ఆగస్టు 8న కూడా అదే ప్రాంతంలో మిగతా ఏడు ప్లాస్టిక్ సంచులు బయటపడ్డాయి. మొత్తం 14 సంచుల్లో ఒక మహిళ మృతదేహం ముక్కలు, తల సహా ప్యాక్ చేసి విసిరి ఉంచినట్టు పోలీసులు నిర్ధారించారు.

తల ఆధారంగా గుర్తింపు ప్రయత్నాలు
పోలీసులు ఆ మహిళ తలను పరిశీలించి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంకా స్పష్టమైన ధృవీకరణ అందలేదని విచారణకు సంబంధించిన అధికారులు తెలిపారు. ఆమె ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లేవు.పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు — ఈ హత్య వేరే చోట జరిగి ఉండొచ్చు. అనంతరం కారులో మృతదేహ భాగాలను తీసుకొచ్చి ఇక్కడ పారేసి ఉండవచ్చని వారు చెబుతున్నారు. చింపుగన్‌హళ్లి, వెంకటపుర గ్రామాలను కలిపే రహదారి వెంబడి ఈ సంచులు చెల్లాచెదురుగా కనిపించాయి. ఇది పక్కా ప్లాన్‌తో చేసిన హత్యగా భావిస్తున్నారు.
దర్యాప్తుకు ప్రత్యేక బృందాలు
తుమకూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కెవి ఆ ప్రాంతంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. మృతదేహ భాగాలు లభించిన కోలాలా గ్రామం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో intensive గా విచారణ సాగుతోంది. స్థానిక ప్రజల సహాయంతో ప్రతి చిన్న సమాచారం సేకరిస్తున్నారు.శనివారం ఆ ప్రాంతంలో కురిసిన భారీ వర్షం దర్యాప్తును కాస్తా సంక్లిష్టం చేసింది. ఇంకా మిగిలి ఉండే శరీర భాగాలు కనిపించవచ్చన్న అనుమానంతో పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. వాతావరణం అనుకూలంగా మారితే మళ్లీ ఆ ప్రాంతాన్ని దశలవారీగా జల్లెడ పట్టాలని నిర్ణయించారు.
స్థానికుల భయాందోళన
ఈ దారుణ ఘటన స్థానిక ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. ఇదంతా మా ఊర్లో జరుగుతుందా? అనే భయంతో ప్రజలు తమ పిల్లలను బయటకు పంపడం మానేశారు. పోలీసులు భద్రత పెంచినప్పటికీ ఆందోళన ఇంకా తీరలేదు.ఈ కేసులో కీలకమైన విషయాలు ఇంకా బయటపడాల్సి ఉంది. ఆ మహిళ ఎవరు? హత్యకు పాల్పడింది ఎవరు? ఎందుకు చేశాడు? అన్నది సమాధానాల కోసం వేచి చూడాలి. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్టు తెలిపారు.
Read Also : Mohammed Siraj : సిరాజ్‌కు రాఖీ కట్టిన ఆశా భోస్లే మనవరాలు!