7 Dead, Over 50 Injured After Wooden Stage Collapses During 'Laddu Mahotsav' in UP's Baghpat

లడ్డూ మహోత్సవంలో విషాదం.. ఏడుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మంగళ వారం రోజు ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. బాగ్‌పత్‌ లో ఆదినాథుడి ఆలయంలో నిర్వహిస్తున్న నిర్వాణ లడ్డూ ఉత్సవంలో ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. వెదురు, కలప చెక్కతో చేసిన ఈ వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోగా.. ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే 60 మందికి పైగా ప్రజలు తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే ఇందులో మహిళలు, చిన్నారులు సహా వృద్ధులు కూడా ఉన్నట్లు సమాచారం.

image

ఉత్తర ప్రదేశ్ బాగ్‌పత్‌లోని ఆదినాథుడి ఆలయంలో నిర్వాణ లడ్డూ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఎంతో ఘనంగా చేస్తున్న ఈ వేడుకకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వస్తుంటారు. ముఖ్యంగా మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ నుంచి వేలాది మంది భక్తులు వచ్చారు. ఈక్రమంలోనే నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వెదురు, కలప చెక్కలతో వేదికను నిర్మించారు. అయితే ఈరోజు ఎక్కువ మంది భక్తులు ఉత్సవం పాల్గొనడం.. దాదాపు 60 మంది వరకు భక్తులు వేదికపైకి ఎక్కారు.

దీంతో బరువు ఆపలేకపోయిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో భక్తులు అంతా కింద పడిపోయారు. ఐదుగురు ప్రజలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా భక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే సహాయ చర్యలు అందించారు. ఒక్కొక్కరినీ బయటకు తీసుకు వస్తూనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతులతో పాటు క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

Related Posts
వైఎస్ జగన్తో ఆర్కే రోజా భేటీ
RK Roja meet with YS Jagan

గాలి జగదీశ్ ను పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్న హైకమాండ్ అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తాడేపల్లిలోని ఆయన నివాసంలో మాజీ మంత్రి Read more

తెలంగాణ సచివాలయంలో ఊడిపడ్డ పెచ్చులు
upheavals in the telangana

ప్రమాదంలో తెలంగాణ సచివాలయం తెలంగాణ సచివాలయ భవన నిర్మాణంలో లోపాలు బయటపడుతున్నాయి. తాజాగా సచివాలయ ఐదో అంతస్తు నుంచి పెచ్చులు ఊడి పడిన ఘటన కలకలం రేపింది. Read more

రూపాయి పతనం పై మోడీని ప్రశ్నించిన ప్రియాంక
Priyanka questioned Modi on rupee fall

న్యూఢిల్లీ: అమెరికా డాలరుతో రూపాయి మారకం విడుదల దారుణంగా పడిపోవడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వాన్ని శనివారంనాడు నిలదీశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర Read more

ఆర్జీకర్‌ ఆసుపత్రిలో వైద్యురాలి విగ్రహం.. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
statue of a doctor in Rg Kar hospital. There are different opinions on social media

statue of a doctor in Rg Kar hospital.. There are different opinions on social media కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా Read more