50 percent increase Ticket rates in Telangana RTC buses!

ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్

హైదరాబాద్‌: సంక్రాంతి వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాకిచ్చింది. పండుగ నేపథ్యంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో అధికంగా రద్దీ ఉండే అవకాశం ఉందని.. ఆ మేరకు బస్సులు నడిపేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించింది. సంక్రాంతి పండుగకు 6,432 స్పెషల్ సర్వీసులు నడిపిస్తామని.. ఈ నెల 19, 20 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. ‘ప్రత్యేక బస్సులకయ్యే డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో 16 జారీ చేసింది. ఈ నెల 10, 11, 12, 19, 20 5 రోజుల పాటు అదనపు ఛార్జీలు ఉంటాయి.’ అని ఓ ప్రకటనలో తెలిపారు.

image
image

సంక్రాంతికి నడిపే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ‘మహాలక్ష్మి’ పథకం కింద ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా ఉంటుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. అటు, సంక్రాంతి ప్రత్యేక సర్వీసుల పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్‌సెంటర్ నెంబర్లు 040 – 69440000, 040 – 23450033 ను సంప్రదించాలని సూచించింది. మరోవైపు, రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మొత్తం 6,432 ప్రత్యేక బస్సులను నడపనుండగా.. 557 సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ అమల్లోకి తెచ్చింది. ఈ నెల 9వ తేదీ నుంచి 15 వరకూ ఇవి అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్ నుంచి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. అమలాపురం, కాకినాడ, కందుకూరు, నర్సాపురం, పోలవరం, రాజమహేంద్రవరం, రాజోలు, ఉదయగిరి, విశాఖ, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి నగరాలకు ఈ బస్సులు నడుస్తాయి. తెలంగాణతో పాటు ఏపీ నుంచి తిరుగు పయనమయ్యే వారి కోసం కూడా ఈ ప్రత్యేక బస్సులు సంస్థ ఏర్పాటు చేసింది. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రచించింది.

కాగా, ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం టీటీడీ అధికారిక వెబ్ సైట్ www.tgsrtcbus.in లో చేసుకోవాలని పేర్కొంది. అటు, ఏపీఎస్ఆర్టీసీ సైతం పండుగ నేపథ్యంలో ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ఈ నెల 9 నుంచి 13 వరకూ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని.. ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది.

Related Posts
కొత్త ఐటీ చట్టంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR key comments on the new IT Act

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టంపైకీలక వ్యాఖ్యలు చేశారు. ఇది దేశ పౌరుల డిజిటల్ గోప్యతకు ముప్పుగా మారుతుందని అభిప్రాయపడ్డారు. Read more

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..నేడు కీలక బిల్లును ప్రవేశపెట్టనున్న పవన్ కల్యాణ్
WhatsApp Image 2024 11 11 at 10.56.56

అమరావతి: రెండో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 9 గంటలకు Read more

సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ద్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్ర‌హం
Pawan Kalyan anger over the demolition of Muthyalamma statue in Secunderabad

హైదరాబాద్‌: ఈ నెల 13 ఆదివారం అర్దరాత్రి సమయంలోతెలంగాణలో జరిగిన అమ్మవారి విగ్రహ ధ్వంసంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. సికింద్రాబాద్‌ ముత్యాలమ్మ విగ్రహ Read more

పొంగులేటి బాంబులన్నీ తుస్సు..తుస్సు..?
runamafi ponguleti

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. సియోల్ పర్యటన అనంతరం రాష్ట్రంలో పలు కీలక రాజకీయ పరిణామాలు జరగబోతాయని, Read more