AP Cabinet meeting today.. Discussion on these issues!

AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ!

AP Cabinet : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్య‌క్ష‌త‌న ఈరోజు (మంగళవారం) కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో పలు కీల‌క అంశాలపై కేబినెట్ చర్చించి అమోదం తెలుప‌నుంది. సీఆర్డీఏ 46వ ఆధారిటీలో అమోదించిన అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమ‌రావ‌తి నిర్మాణం కోసం అవ‌స‌ర‌మైన నిధులు స‌మీక‌రించుకునేందుకు సీఆర్డీఏ క‌మిష‌న‌ర్‌కు కేబినెట్ అనుమ‌తి ఇవ్వ‌నుంది. నూత‌న అసెంబ్లీ, హైకోర్టు భ‌వ‌నాల టెండ‌ర్ల‌కు ఓకే చెప్పనుంది. ఐదో ఎస్ఐపీబీ సమావేశంలో అమోదించిన పెట్టుబడులకు ఓ నిర్ణయం తీసుకోనుంది.

Advertisements
నేడు ఏపీ కేబినెట్ సమావేశం

పలు కంపెనీల పెట్టుబడులకు మంత్రిమండలి ఆమోదం

కొత్తగా రూ.30,667 కోట్లు పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు వ‌చ్చే ప్ర‌తిపాద‌న‌ల‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీ ఏర్పాటుతో సహా పలు కంపెనీల పెట్టుబడులకు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూకేటాయింపులకు అమోదించనుంది. ఉండవల్లి, పెనుమాక రైతులకు జరీబు భూములకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే అంశంపై అథారిటీ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదించనుంది. ఏపీ మంత్రి మండలి సమావేశంలో కుప్పం నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది.

ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు భూములను కేటాయిస్తూ నిర్ణయం

నెల్లూరులో ఏపీఐఐసీకి, విజయనగరం జిల్లాలో గ్రే హౌండ్స్‌కు గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు కేబినెట్‌లో భూములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందుగా నాలా ఫీజు రద్దు అంశాన్ని కేబినెట్‌లో ఈ సారి ఉంచాలని మంత్రి మండలి భావించింది. అయితే ఆ శాఖను చూసే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా బదిలీ కావడంతో ఈ సారి కేబినెట్‌లో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉండకపోవచ్చని సమాచారం.

Read Also:  వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్

Related Posts
Ayodhya: శ్రీరామ నవమి సందర్బంగా అయోధ్యలో అదిరిపోయే ఘట్టం
శ్రీరామ నవమి సందర్బంగా అయోధ్యలో అదిరిపోయే ఘట్టం

శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య ఇప్పుడు భక్తిశ్రద్ధలతో నిండిపోయింది. ప్రతి ఏటా శ్రీరామనవమి పర్వదినం ఎంతో వైభవంగా జరుగుతుంది కానీ ఈ సారి అది మరింత ప్రత్యేకంగా మారింది. Read more

రతన్ టాటా చివరి పోస్ట్ ఇదే..
ratan tata last post

ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చేసిన లాస్ట్ పోస్ట్ వైరలవుతోంది. 3 రోజుల క్రితం తన Read more

17 వేల మంది ఉద్యోగులపై వేటు: బోయింగ్ విమాన సంస్థ
17 వేల మంది ఉద్యోగులపై వేటు: బోయింగ్ విమాన సంస్థ

ముంబయి: విమాన తయారీ దిగ్గజ సంస్థ బోయింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మంది అంటే 17 వేల మంది Read more

నిక్కర్ మంత్రి అంటూ లోకేష్ పై వైసీపీ సెటైర్లు..
మాకు రాష్ట్రాలతో కాదు దేశాలతోనే పోటీ - నారా లోకేశ్

త్వరలోనే రెడ్ బుక్ మూడో ఛాప్టర్ తెరుస్తానని మంత్రి నారా లోకేష్ చేసిన హెచ్చరికలపై వైసీపీ Xలో సెటైర్లు వేసింది. 'మూడో ఛాప్టర్ కాదు నిక్కర్ మంత్రి.. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×