మొత్తం రూ.3.20 లక్షల కోట్లతో వార్షి బడ్జెట్
అమరావతి: 2025-26 వార్షిక బడ్జెట్ కు సంబంధించి సీఎం చంద్రబాబు అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ మేరకు మొత్తం రూ.3.20 లక్షల కోట్లతో వార్షి బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కేబినెట్‌లో ప్రతిపాదించారు. ఈ మేరకు మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు అసెంబ్లీ లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ , శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఈ బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాలు
కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టబోతుండటం విశేషం. అయితే, ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ అటు రాజకీయ వర్గాల్లోనూ.. ఇటు సాధారణ ప్రజల్లోనూ ఓ రకమైన ఉత్కంఠ నెలకొంది. ఈ బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాల తో పాటు రాష్ట్ర అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజన్-2047 లక్ష్యంగా ఆర్థిక శాఖ వార్షిక బడ్జెట్‌ను రూపొందించినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఇక, 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 10 శాతం ఎక్కువ. ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది.