అయ్యో చేప ఎంత పని చేసింది..చెయ్యి కోల్పోవాల్సి వచ్చింది.

అయ్యో చేప ఎంత పని చేసింది..చెయ్యి కోల్పోవాల్సి వచ్చింది.

కేరళ రాష్ట్రం తలస్సేరీ ప్రాంతంలో చేప కరవడంతో ఒక రైతు తన అరచేతిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటగా చిన్న గాయంగా అనిపించినా, అది తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌కు దారి తీసి చివరికి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది.కన్నూర్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల టి. రాజేశ్ అనే రైతు తన పొలంలోని ఒక చిన్న నీటి గుంటను శుభ్రం చేస్తున్న సమయంలో, “కడు” అనే జాతికి చెందిన చేప అతని కుడి చేతి వేలిని కొరికింది. ఆ కరిచిన ప్రదేశంలో చిన్న గాయమైందని భావించిన రాజేశ్, దానిని లైట్ తీసుకుని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ సి) కు వెళ్లి ప్రాథమిక చికిత్స పొందాడు. అక్కడ ఇచ్చిన మందులు వేసుకున్నప్పటికీ, గాయం తగ్గలేదు.కొద్దిరోజులకు రాజేశ్ చేయిలో తీవ్రమైన నొప్పి మొదలైంది.అరచేతిపై బొబ్బలు కూడా వచ్చాయి. గాయంను తక్కువగా అంచనా వేసిన అతడు, నొప్పి పెరిగాక దగ్గర్లోని మహే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. కానీ అక్కడి వైద్యులు గాయానికి సరైన కారణం తెలియక, కోజికోడ్ బేబీ మెమోరియల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.

చేప కొరకడంతో

నీటి గుంటను శుభ్రం చేస్తున్న సమయంలో, “కడు” అనే జాతికి చెందిన చేప అతని కుడి చేతి వేలిని కొరికింది. బేబీ మెమోరియల్ వైద్యులు రాజేశ్​కు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి,అతనికి గ్యాస్ గ్యాంగ్రీన్​ అనే బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్  సోకిందని నిర్ధారించారు. చేతి వేళ్లను తొలగించకపోతే ఆ బ్యాక్టీరియా పైకి పాకి మరింత సోకే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. దీంతో అతడి సమ్మతి మేరకు రాజేశ్​ చేతి వేళ్లను తొలగించారు డాక్టర్లు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇన్ఫెక్షన్ ఇంకాస్త పైకి వ్యాప్తించింది. దీంతో రాజేశ్​ అరచేతి మొత్తాన్ని తొలగించాల్సి వచ్చింది.బురద నీటిలో కనిపించే క్లోస్ట్రడియం పెర్ఫ్రింజెన్స్ అనే బ్యాక్టీరియ వల్ల ఈ గ్యాస్​ గ్యాంగ్రీన్ అనే ఇన్ఫెక్షన్ వస్తుందని బేబీ మెమోరియాల్ ఆస్పత్రి వైద్యలు కృష్ణకుమార్ తెలిపారు.ఈ బ్యాక్టీరియా బాడీలోకి ప్రవేశించి కణాలను నాశనం చేస్తుందన్నారు. ఇన్ఫెక్షన్​ మెదడుకు వ్యాప్తిస్తే ప్రాణాలకే ప్రమాదమన్నారు. రాజేశ్​ అరచేతిని తొలగించడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయిందని కృష్ణకుమార్ చెప్పారు. చేతి వేలి గాయం ద్వారా ఆ బ్యాక్టీరియా శరీరం లోపలికి ప్రవేశించి ఉండవచ్చని అంచనా వేశారు.

katla fish 500x500

బురద నీటిలో కనిపించే ఈ ప్రమాదకరమైన క్లోస్ట్రిడియం పెర్ఫ్రింజెన్స్ బ్యాక్టీరియా చిన్న గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించగలదు. ఇది శరీరంలోని కణజాలాన్ని నాశనం చేయడంతో పాటు, రక్తం ద్వారా మెదడుకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది.చేపలు, నీటి జీవుల వల్ల గాయాలైనా తక్షణమే వైద్యుల సూచన తీసుకోవాలి.బురద నీటిలో ఉండే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని గుర్తు పెట్టుకోవాలి.గాయం తేలికగా అనిపించినా, అది తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నందున త్వరగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.తప్పనిసరి పరిస్థితుల్లోనే చెరువులు, నీటి గుంటలు శుభ్రం చేయాలి.గాయమైన ప్రదేశాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలి.

Related Posts
దేశంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలుసా?
how many companies india

ఇప్పటి వరకు 5,216 విదేశీ కంపెనీలు 2025 జనవరి 31 నాటికి 28 లక్షలకు పైగా కంపెనీలు రిజిస్టర్ దేశంలో వ్యాపార రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న Read more

నేడు పార్లమెంటుముందుకు కొత్తఐటీ బిల్లు
New IT bill before Parliame

కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లు-2025ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాన్ని సవరించి, ఆధునిక అవసరాలకు తగిన విధంగా మార్చే లక్ష్యంతో Read more

లోక్‌సభ ముందుకు జమి ఎన్నికల బిల్లు
one nation one poll to be introduced in lok sabha on december 16

న్యూఢిల్లీ: ఒకే దేశం- ఒకే ఎన్నికలు' బిల్లు ఈ నెల 16న లోక్‌సభ ముందుకు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ఈ బిల్లును లోక్‌సభలో Read more

చంద్రబాబు ప్రచారంతో ఘనవిజయం!
చంద్రబాబు ప్రచారంతో ఘనవిజయం!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాదారా నియోజకవర్గం ఈసారి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏకంగా 32 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించగలిగింది. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *