ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. “పవన్ ఒక సీరియస్ పొలిటీషియన్ కారు” అని అనడం జనసేన శ్రేణులను తీవ్రంగా నొప్పించింది. సోషల్ మీడియా వేదికగా జనసేన కార్యకర్తలు, నేతలు ఆమె వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అభిమానులు ‘ఇది కేవలం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కాదు, ప్రజల నమ్మకాన్ని తక్కువగా చూసినట్లే’ అని పేర్కొంటున్నారు.
పదవి అడ్డుపెట్టుకుని మద్యం కుంభకోణాలు
ఈ నేపథ్యంలో జనసేన నేత పృథ్వీ స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా కవిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. “పాలకుల బాధ్యత గురించి మాట్లాడే ముందు మీ గతాన్ని ఒకసారి చూసుకోండి. మేడం పొలిటికల్ సీరియస్ గురించి మాట్లాడడం బాగుంది. ఇచ్చిన శాఖకు 200% న్యాయం చేసిన పవన్ కళ్యాణ్ ఎక్కడ… పదవి అడ్డుపెట్టుకుని మద్యం కుంభకోణాలు చేసిన మీరు ఎక్కడ?” అంటూ తీవ్రంగా విమర్శించారు. ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలపై నిబద్ధతతో పని చేస్తున్నారు
జనసేన శ్రేణులు కూడా పృథ్వీకి మద్దతుగా నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలపై నిబద్ధతతో పనిచేస్తున్నారని, రాజకీయ స్వార్థాలతో మాట్లాడే నాయకులకు సమాధానం ప్రజలే చెబుతారని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జనసేన కార్యకర్తలు మాత్రం కవిత వ్యాఖ్యలను తిప్పిపారేస్తూ, పవన్‌కి ఉన్న మద్దతు ఎప్పుడు ఎలా ఉంటుందో చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు.