ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లో భద్రతా బలగాలు మావోయిస్టులపై మరోసారి కాల్పులూ౮ జరిపాయి.గురువారం (మార్చి 21, 2025) చోటుచేసుకున్న రెండు పెద్ద ఎదురుకాల్పుల ఘటనల్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు,భద్రతా బలగాల తాలూకా ఒక జవాను వీరమరణం చెందాడు.
దంతెవాడలో భారీ ఎదురుకాల్పులు
బీజాపుర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని ఆండ్రి అటవీ ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారనే నిఘావర్గాల సమాచారంతో డీఆర్డీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్), ఎస్టీఎఫ్ (స్పెషల్ టాస్క్ ఫోర్స్), కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్) సంయుక్త బలగాలు బుధవారం ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకూ ఇరువర్గాల మధ్య భీకరకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను, పెద్దఎత్తున ఆయుధాలు, పేలుడు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో పశ్చిమ బస్తర్ డివిజినల్ కమిటీ సభ్యులు ఉండొచ్చని భావిస్తున్నట్లు బీజాపుర్ ఎస్పీ జితేంద్రకుమార్యాదవ్, దంతెవాడ ఎస్పీ గౌరవ్రాయ్ తెలిపారు.
డివిజన్ కమిటీ
బలగాలు క్యాంపులకు చేరిన తర్వాత పూర్తివివరాలు వెల్లడిస్తామన్నారు. కాంకేర్-నారాయణపుర్ సరిహద్దులోని బీనగుండా, పురుష్కోడు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు ఉత్తర బస్తర్ మాద్ డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నారన్న సమాచారంతో డీఆర్ , బీఎస్ఎఫ్ నేతృత్వంలోని సంయుక్త బలగాలు కూంబింగ్ చేపట్టాయి. గురువారం ఉదయం ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా.. డీఆర్జే జవాను రాజు ఓయం వీరమరణం పొందారు. మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధాలను, ఇతర వస్తువులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక్కడ కాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

దంతెవాడ సరిహద్దులో ఐఈడీ పేలుడు
తులులి అటవీప్రాంతంలో మావోయిస్టుల పెట్టిన ఐఈడీ పేలడంతో,నక్సల్స్ ఆపరేషన్‌లో ఉన్న రెండు మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.వారి పరిస్థితి ఆశంకాజనకంగా ఉందని అధికారులు తెలిపారు.
త్వరలోనే మావోయిస్టుల అంతం: అమిత్
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ ఘటనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ స్పందించారు. నక్సల్స్ ను అంతమొందించేందుకు ఇదొక పెద్ద విజయం అని అభివర్ణించారు.మార్చి 31, 2026 నాటికి దేశాన్ని పూర్తిగా నక్సల్స్ రహితంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం అని స్పష్టం చేశారు.ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తున్నప్పటికీ లొంగిపోని మావోయిస్టులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. మృత జవాను రాజు ఓయంకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ నాయిక్ నివాళులు అర్పించారు.