తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి ఆన్లైన్లో టికెట్లు అందిస్తున్నట్టు చూపించి, సైబర్ నేరగాళ్లు భక్తులను మోసం చేస్తున్నారు. గెస్ట్‌హౌస్‌లు, వసతి బుకింగ్‌లు పేరుతో నకిలీ వెబ్సైట్లు ఏర్పాటుచేసి డబ్బులు వసూలు చేస్తున్నారు.ఈ మోసాలకు అడ్డుకట్ట వేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకు 28 నకిలీ వెబ్సైట్లు తొలగించారు. మిగతావి కూడా తొలగించేందుకు ప్రక్రియ కొనసాగుతోంది.సప్తగిరి, నందకం, పద్మావతి గెస్ట్‌హౌస్ వంటి పేర్లతో నకిలీ సైట్లు (Fake sites) రూపొందించి భక్తులను విశ్వసింపజేస్తున్నారు. కానీ, ఈ సైట్లు టీటీడీకి ఎలాంటి సంబంధం ఉండదని పోలీసులు స్పష్టం చేశారు.భక్తులు www.tirumala.org అనే టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే టికెట్లు, వసతి, సేవలు పొందాలని స్పష్టంగా సూచిస్తున్నారు. దీనికంటే ఇతర ఏ వెబ్‌సైట్‌నూ నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్, క్యూఆర్ కోడ్‌తో మోసాలు – జాగ్రత్త
కొంతమంది నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి దర్శనం ఏర్పాటు చేస్తామంటున్నారు. అప్పుడు క్యూఆర్ కోడ్లు పంపించి డబ్బులు చెల్లించమంటున్నారు. ఇలాంటి వాటికి అస్సలు స్పందించకండి.ఎవరైనా మోసపూరితంగా సంప్రదిస్తే, లేదా నకిలీ వెబ్సైట్ కనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్‌కి, లేదా 100 నంబర్‌కి, లేక టీటీడీ టోల్ ఫ్రీ 1800 425 4141 నంబర్‌కి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
భక్తుల భద్రత : పోలీసుల ప్రకటన
తిరుమల పోలీసుల ప్రకారం, భక్తులు భద్రతగా, మోసాలకు గురికాకుండా, నిర్భయంగా దర్శనం చేసుకోవాలన్నదే వారి లక్ష్యం. అందుకే సైబర్ నేరాలపై నిఘా మరింత కఠినంగా కొనసాగిస్తున్నారు.ఈ ఆధునిక డిజిటల్ యుగంలో మోసాలు పెరుగుతున్నాయి. కానీ, సరైన సమాచారం, అప్రమత్తత ఉంటే ఎలాంటి మోసానికీ తావుండదు. టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే సేవలు పొందండి. మిగతా సైట్ల నుంచి దూరంగా ఉండండి. భక్తి పూజలో నమ్మకం ఉంటే సరిపోదు – భద్రతపై కూడా నమ్మకంగా ఉండండి! www.tirumala.org
Read Also :