27 Naxalites killed in enco

ఛత్తీస్గఢ్ ఎన్ కౌంటర్ – 27కు చేరిన మృతుల సంఖ్య

ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దులోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో భద్రతా బలగాలు నిర్వహించిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుంది. మొదట 12 మందే అనుకున్నాం కానీ గంటలు గడిచేకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ ఎన్ కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన మావోయిస్టుల కార్యకలాపాలకు గట్టి ఎదురు దెబ్బగా నిలిచింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 16 మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఆపరేషన్లు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కోబ్రా సెక్యూరిటీ ఫోర్సెస్ మావోయిస్టులతో తలపడటం వల్ల తీవ్ర కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల అడ్డాలకు చేరుకోవడంతో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మావోయిస్టుల దాడులు తగ్గించడం కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మావోయిస్టులు ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఈ సంఘటన తరువాత బోర్డర్ ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలను నిరోధించేందుకు ప్రత్యేక బలగాలను నియమించారు.

Related Posts
ఆయుష్మాన్ భారత్‌ ద్వారా క్యాన్సర్ చికిత్స
నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: ఆయుష్మాన్ భారత్‌ ద్వారా క్యాన్సర్ చికిత్స

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (World Cancer Day) జరుపుకుంటారు. ఈ రోజును యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) ప్రారంభించింది. Read more

తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీం కోర్టులో విచారణ.. ధర్మాసనం కీలక తీర్పు
supreme court appoints special sit for tirumala laddu probe

supreme-court-appoints-special-sit-for-tirumala-laddu-probe న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు స్వతంత్ర దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో Read more

UFBU Bank: బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరెన్..కస్టమర్లకు అలెర్ట్
బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరెన్..కస్టమర్లకు అలెర్ట్

బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నారు. ఇందుకు మార్చి 24 నుండి 25 తేదీలలో దేశవ్యాప్తంగా సమ్మెకు యూనియన్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ Read more

పల్నాడులో హృదయ విదారక ఘటన
rat attack

పల్నాడు జిల్లాలో జరిగిన హృదయ విదారక ఘటన అందరినీ కలచివేసింది. నూజెండ్ల మండలం రవ్వారంలో నాలుగు నెలల చిన్నారిని పందికొక్కులు దాడి చేసి ప్రాణాలు తీసిన విషాద Read more