IMDb Announces Most Popular

2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ ను ప్రకటించిన ఐఎండీబీ

ముంబై-డిసెంబర్ 2024 : IMDb (www.imdb.com) సినిమాలు, టీవీ మరియు ప్రముఖుల సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఎండిబి నేడు 2024 టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ జాబితాను ప్రకటించింది. 2024లో నెం.1 ఇండియన్ స్టార్ అయిన త్రిప్తి డిమ్రి ఈ ఏడాది బ్యాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో, భూల్ భులైయా 3 అనే మూడు సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

“ఐఎండీబీ మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ 2024 జాబితా భారతీయ వినోదరంగంలోని విభిన్నతను ప్రదర్శిస్తుంది. ఇందులో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న నటులతో పాటు కొత్తగా వస్తున్న నటులను కలుపుకుని ఉంది” అని ఐఎండిబి ఇండియా హెడ్ యామిని పటోడియా అన్నారు. “మా ఈ వార్షిక జాబితా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల అభివృద్ధి చెందుతున్న ఆసక్తులను ప్రతిబింబిస్తుంది. షారుఖ్ ఖాన్ మరియు ఐశ్వర్య రాయ్ బచ్చన్ వంటి లెజెండరీ తారలు త్రిప్తి దిమ్రీ మరియు షార్వరి వంటి వర్ధమాన ప్రతిభావంతులతో పాటు అభిమానులను ఎలా ఆకర్షిస్తున్నారో హైలైట్ చేస్తుంది. ఈ ఏడాది జాబితా భారతీయ సినిమా రంగంలోని నటులు వారి విస్తరిస్తున్న అంతర్జాతీయ ఆకర్షణను కూడా తెలియజేస్తుంది”

తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన తృప్తి డిమ్రీ, “ఐఎండిబి మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ 2024 జాబితాలో నెం.1 స్థానం పొందడం నిజంగా గొప్ప గౌరవం. ఈ గుర్తింపు నా అభిమానుల నమ్మశక్యం కాని మద్దతుకు మరియు నాకు సహకరించిన ప్రతి ఒక్కరి కృషికి ఇది నిదర్శనం. అద్భుతమైన ప్రాజెక్టులలో పనిచేయడం నుండి 2024 భూల్ భులైయా 3తో ముగించడం వరకు, ఇది నాకు చిరస్మరణీయమైన సంవత్సరం. నేను ఈ స్ఫూర్తిదాయక పరిశ్రమలో భాగం అవుతూనే భవిష్యత్ ఎలా ఉంటుందో అని ఎదురుచూస్తున్నాను”

2024 సంవత్సరానికి గాను టాప్ 10-మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్

  1. త్రిప్తి డిమ్రీ
  2. దీపికా పదుకొణె
  3. ఇషాన్ ఖట్టర్
  4. షారుఖ్ ఖాన్
  5. శోభిత ధూళిపాళ
  6. శార్వరి
  7. ఐశ్వర్య రాయ్ బచ్చన్
  8. సమంత
  9. అలియా భట్
  10. ప్రభాస్

ఐఎండీబీ టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ 2024 జాబితాలో 2024లో ఐఎండీబీ వీక్లీ ర్యాంకింగ్స్ లో నిలకడగా అగ్రస్థానంలో నిలిచిన తారలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐఎండిబికి 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల వీక్షణల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇవ్వబడ్డాయి.

ఈ సంవత్సరం మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ గురించి కొంత అదనపు సమాచారం:

దీపికా పదుకొణె (నెం.2) ఈ ఏడాది మూడు ప్రధాన చిత్రాలు విడుదలయ్యాయి: ఫైటర్, కల్కి 2898 A.D, సింగం ఎగైన్. కల్కి.2898 A.D సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తన కెరీర్ లో మరో మైలురాయిని అందుకుంది.

ఇషాన్ ఖట్టర్ (నెం.3) తన రెండవ అంతర్జాతీయ టీవీ సిరీస్ ది పర్ఫెక్ట్ కపుల్ పాత్రతో తన అభిమానులకు దగ్గరయ్యాడు, దీనిలో నికోల్ కిడ్ మన్, లీవ్ ష్రైబర్ మరియు ఈవ్ హ్యూసన్ లతో కలిసి నటించాడు.


శోభితా ధూళిపాళ (నెం.5) ఈ ఏడాది మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కల్కి 2898 A.D, కోసం తెలుగులో దీపికా పదుకొణెకు డబ్బింగ్ చెప్పింది. అంతేకాకుండా ఈ ఏడాది తెలుగు హీరో నాగచైతన్య అక్కినేనితో ఆమె నిశ్చితార్థం జరిగింది.

Related Posts
గత ఏడాది అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీలు వీరే
celbs income

ఆదాయపు పన్ను భారీగా చెల్లించిన భారతీయ సెలబ్రిటీలకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఇందులో మన సౌత్ స్టార్ హీరో 2వ స్థానం దక్కడం ఇంటర్నెట్‌లో సంచలనం Read more

ఐఐటీ బాంబేతో ఎస్ఆర్ఐ – నోయిడా అవగాహన ఒప్పందం..
Samsung agreement on digita

అత్యాధునిక పరిశోధనలను నిర్వహించడం, డిజిటల్ ఆరోగ్యం , కృత్రిమ మేధస్సులో తదుపరి తరం సాంకేతికతలను అభివృద్ధి చేయడాన్ని ఈ ఐదేళ్ల భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సహకారం Read more

పోసానికి పోలీస్ కస్టడీ..రేపు, ఎల్లుండి విచారణ
పోసానికి పోలీస్ కస్టడీ..రేపు, ఎల్లుండి విచారణ

పోసానికి పోలీస్ కస్టడీ..రేపు, ఎల్లుండి విచారణ టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళికి కేసుల చిక్కులు ఇప్పట్లో తీరేలా లేవు.ఒక కేసులో బెయిల్ రావడంతో ఊపిరిపీల్చుకునేలోపే, మరో కేసులో Read more

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో చంద్రబాబు, లోకేశ్ భేటీ
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో చంద్రబాబు, లోకేశ్ భేటీ

ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ దావోస్‌లో సమావేశమయ్యారు. ఈ Read more