మూడోసారి కూడా నేనే అధ్యక్షుడుగా వుంటాను: ట్రంప్

2వేల మంది యూఎస్‌ ఎయిడ్‌ ఉద్యోగులపై ట్రంప్‌ వేటు

యూఎస్​ఎయిడ్ వెబ్​సైట్​లో ఓ నోటీసు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెంచారు. ఓ వైపు ప్రపంచ దేశాలకు అమెరికా సాయాన్ని నిలిపివేసిన ట్రంప్ తాజాగా యూఎస్‌ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ యూఎస్ ఎయిడ్‌ ఉద్యోగులపై ట్రంప్‌ వేటు వేశారు. రెండు వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు యూఎస్​ఎయిడ్ వెబ్​సైట్​లో ఓ నోటీసు ద్వారా తెలిపారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా మిగిలినవారిలో కొంతమందిని మినహాయించి వేలమంది ఉద్యోగులకు బలవంతపు సెలవులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఎయిడ్‌ ఉద్యోగులపై ట్రంప్‌ వేటు
ఎయిడ్‌ ఉద్యోగులపై ట్రంప్‌ వేటు

నేరగాళ్ల సంస్థ అని మస్క్‌ ఆరోపణలు

ఉద్యోగుల తొలగింపునకు ఫెడరల్‌ జడ్జి అనుమతించిన తర్వాతే ట్రంప్‌ యంత్రాంగం ఈ విషయంలో ముందుకెళ్లింది. ప్రభుత్వ ప్రణాళికను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని యూఎస్‌ డిస్ట్రిక్ట్ జడ్జి కార్ల నికోలస్ తిరస్కరించారు. ప్రభుత్వం చేసే అనవసరపు ఖర్చులను తగ్గించడానికి పనిచేస్తున్న మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ ఇప్పటికే అనేకమంది యూఎస్‌ఎయిడ్ ఉద్యోగులపై వేటు వేసింది. తాజాగా తీసుకొన్న ఈ నిర్ణయం మిగిలిన ఉద్యోగుల్లో భయాందోళన కలిగిస్తోంది. అయితే యుఎస్‌ఎయిడ్‌ ద్వారా వృథా ఖర్చులు ఎక్కువవుతున్నాయని, అది నేరగాళ్ల సంస్థ అని మస్క్‌ ఇప్పటికే ఆరోపణలు చేశారు.

తన చర్యలను సమర్థించుకున్న ట్రంప్‌

అందుకే నిధులను ఆపేస్తున్నట్లు ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులోభాగంగా దాదాపు 600 మంది ఉద్యోగులను కార్యాలయ భవనంలోకి వెళ్లనీయకుండా నిలిపివేశారు. ఈ ఆదేశాలపై ఫెడరల్‌ జడ్జి అమీర్‌ అలీ గతవారం తాత్కాలికంగా స్టే ఇచ్చారు. అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు యూఎస్‌ఎయిడ్‌ ద్వారా సాయం అందించడానికి ఆమోదం తెలిపినప్పుడు ప్రభుత్వం దాన్ని ఎలా నిలిపేయగలదని జడ్జి నిలదీశారు. అయినా ట్రంప్‌ తన చర్యలను సమర్థించుకుంటున్నారు. యూఎస్‌ ఎయిడ్‌ ద్వారా భారత్‌లో జరిగిన ఎన్నికలలో పోలింగ్‌ శాతం పెంచడానికి అమెరికా ప్రభుత్వం రూ.182 కోట్లు ఇచ్చిందని ట్రంప్‌ పలుమార్లు ఆరోపణలు చేశారు.

ప్రపంచం మీద ప్రభావం:

ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సహాయ కార్యక్రమాలకు తీవ్ర ప్రభావం చూపించవచ్చు. యూఎస్‌ఎయిడ్‌ గత కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి చెందని దేశాలకు మానవతా సహాయం, ప్రకృతి వైపరీత్యాల రక్షణ, అభివృద్ధి ప్రాజెక్టులు వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించింది. ఉద్యోగుల తొలగింపు మరియు నిధుల నిలిపివేతతో ఈ సహాయ కార్యక్రమాలు తీవ్రంగా ప్రభావితం కావచ్చు.

ప్రపంచ దేశాలతో సంబంధాలు:

అమెరికా ప్రభుత్వం యూఎస్‌ఎయిడ్ ద్వారా మద్దతు ఇచ్చిన దేశాలు ఈ నిర్ణయం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలలో ఈ నిర్ణయం మరింత ప్రభావం చూపిస్తుంది. ట్రంప్ ఆదేశాల ప్రకారం, మిగిలిన దేశాలలో కొంతమంది ఉద్యోగులను మాత్రమే కొనసాగించటం, మరికొంతమందిని సెలవుపై పంపడం ద్వారా మిగిలిన కార్యాలయ కార్యకలాపాలు కుదటపడే అవకాశం ఉంది.

Related Posts
లోక్‌సభ లో జమిలి ఎన్నికల బిల్లు
WhatsApp Image 2024 12 17 at 1.06.13 PM (1)

ఎంతో కాలంగా బీజేపీ పట్టుదలతో జమిలి ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్న విషయం తెలిసేందే. ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించేందుకు రూపొందించిన బిల్లు Read more

రష్యా నూక్లియర్ ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్ హతం
kirov

రష్యా, ఉక్రెయిన్ దేశాలమధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. తాజాగా స్కూటర్ బాంబు పేలడంతో రష్యా నూక్లియర్ ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ Read more

సింగ‌పూర్ లో తెలంగాణ కల్చ‌ర‌ల్ మీట్ లో సీఎం రేవంత్
CM Revanth at Telangana Cul

సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడి తెలంగాణ కల్చరల్ సొసైటీ నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశం సింగపూర్ Read more

KCR: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
KCR: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

తెలుగు ప్రజల సంస్కృతిలో విశేష స్థానం ఉన్న ఉగాది పర్వదినం మరొకసారి ముంచుకొస్తోంది. ఇది కొత్త సంవత్సరానికి ఆద్యమైన పండుగగా, నూతన ఆశయాలకు నాంది పలుకుతున్న వేడుకగా Read more