200 flights delayed due to heavy fog

భారీగా పొగమంచు 200 విమానాలు ఆలస్యం..

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలపై పొగమంచు తీవ్రత కొనసాగుతోంది. ఢిల్లీ సహా సమీప రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంచు దుప్పటి కారణంగా దృశ్యమానత జీరోకు పడిపోయింది. దీంతో రోడ్డు, రైలు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

శనివారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై విజిబిలిటీ జీరోగా నమోదైంది. దీంతో ఢిల్లీకి రాకపోకలు సాగించే దాదాపు 220కిపైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఢిల్లీతోపాటు నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్, గురుగ్రామ్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

image
image

మరోవైపు ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో వారణాసి, లక్నో, ఆగ్రా, పాట్నా, బరేలీ విమానాశ్రయాల్లో విజిబిలిటీ జీరోకు పడిపోయింది. ఈ కారణంగా ఆయా విమానాశ్రయాల్లో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా కోల్‌కతాలోని శుభాష్‌ చంద్రబోష్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 19 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Related Posts
పిల్లాడిపైకి దూసుకెళ్లిన కారు – ఉత్తర్‌ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన
పిల్లాడిపైకి దూసుకొచ్చిన కారు – ఘజియాబాద్‌లో దారుణ ఘటన!

పిల్లాడిపైకి దూసుకొచ్చిన కారు – ఘజియాబాద్‌లో దారుణ ఘటన! ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ అపార్ట్‌మెంట్ ఆవరణలో ఆడుకుంటున్న పిల్లాడిపైకి కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదం అక్కడి సీసీటీవీ Read more

ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం..
world computer literacy day

ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం ప్రతి సంవత్సరమూ డిసెంబరు 2న జరుపుకుంటారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ విద్యను ప్రోత్సహించడం, డిజిటల్ నైపుణ్యాలు మరియు కంప్యూటర్ నైపుణ్యం Read more

ఎలోన్ మస్క్ OpenAI పరిశోధకుడిపై షాకింగ్ వ్యాఖ్యలు
ఎలోన్ మస్క్ OpenAI పరిశోధకుడిపై షాకింగ్ వ్యాఖ్యలు

ప్రపంచ ప్రసిద్ధి పొందిన టెక్నాలజీ పరిశోధకుడు మరియు ఓపెన్‌ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ మరణం సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ Read more

కాంతార చిత్ర బృందానికి ఊరట
కాంతార చిత్ర బృందానికి ఊరట,

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న రిషబ్ శెట్టి సినిమా ‘కాంతార: చాప్టర్ 1’ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంది. హాసన్ జిల్లా సకలేష్‌పూర్ తాలూకాలోని Read more