అమరావతి: మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రకారం, ఎన్నికల ప్రచారంలో చెప్పిన ప్రకారం, అన్నదాత సుఖీభవ పథకం క్రింద, అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం అని శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు ఇస్తాం అన్నారు ఆయన. కేంద్రం ఇచ్చే రూ. 6 వేలతో కలిపి ఈ నగదు జమ చేస్తాం అని తెలిపారు. ఏపీ వెబ్ ల్యాండ్ ప్రకారం 43 లక్షల మందికి పీఎం కిసాన్ వస్తోంది. వీరితో పాటు 9-10 లక్షల మంది రైతులకు మే నెలలో ఈ డబ్బు జమ చేస్తామన్నారు.

తాము రైతులకు అన్ని విధాలుగా అండగా
బడ్జెట్లో రూ.6300 కోట్లు కేటాయించాం అని ప్రకటించారు. అలాగే కౌలు రైతులకు ఎలా సాయం ఇవ్వాలో ఆలోచన చేస్తున్నాం అని పేర్కొన మంత్రి అచ్చెన్నాయుడు.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా వారికి అండగా ఉంటాం అని అన్నారు. రైతులను గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని… కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. భూసార పరీక్షలు లేవు, వ్యవసాయ యంత్రాలు లేవు, పంటల బీమా చెల్లింపులు లేవని దుయ్యబట్టారు. తాము రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు.
కమిటీతో విచారణ వేసి 45 రోజుల్లో నివేదిక
మరో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’లో భారీ అవినీతి జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించడానికి ఒక ఇండిపెండెంట్ కమిటీతో విచారణ వేసి 45 రోజుల్లో నివేదిక సమర్పిస్తామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చి 18, 19, 20 తేదీల్లో శాసనసభ్యుల కోసం క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించనున్నట్లు గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు తెలిపారు.