17 thousand employees fired. Boeing aircraft company

17 వేల మంది ఉద్యోగులపై వేటు: బోయింగ్ విమాన సంస్థ

ముంబయి: విమాన తయారీ దిగ్గజ సంస్థ బోయింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మంది అంటే 17 వేల మంది ఉద్యోగులపై వేటుకు రెడీ అయింది. ఈ మేరకు సంస్థ సీఈవో కెల్లీ ఓర్ట్‌బెర్గ్ ఈమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. కంపెనీ తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

సియాటెల్ ప్రాంతంలో ఆ సంస్థకు చెందిన 33 వేల మంది కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో పలు విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె కారణంగా 2025లో డెలివరీ చేయాల్సిన 777 ఎక్స్ విమానాలను ఆ తర్వాతి ఏడాదికి అంటే 2026కు వాయిదా వేసింది. ఇప్పటికే ఉన్న ఆర్డర్లు పూర్తయిన తర్వాత 2027 నుంచి 767 ఫ్రైటర్ విమానాల ఉత్పత్తిని కూడా నిలిపివేయాలని కంపెనీ యోచిస్తోంది.

ఇక ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత కంపెనీ షేర్లు 1.7 శాతం పతనమయ్యాయి. కార్మికుల సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో సంస్థ 5 బిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు ఇప్పుడు 17 వేల మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైంది.

Related Posts
హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
telangana new highcourt wil jpg

ts-high-court హైదరాబాద్‌: హైడ్రా కూల్చివేతలపై రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్‌లోని చెరువులు, నాలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.అయితే, Read more

యువ చిత్రనిర్మాతలకు సాంకేతిక మార్పులపై అశ్విని వైష్ణవ్ సందేశం
ashwini vaishnav

కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం యువ చిత్రనిర్మాతలకు ఆవశ్యకమైన సాంకేతికతలను స్వీకరించాలంటూ సూచించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, సినిమాటోగ్రఫీ, నిర్మాణం Read more

రేపు TDP కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు
CBN MGR

ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. పార్టీ వ్యవహారాలను సమీక్షించేందుకు, ముఖ్యంగా నామినేటెడ్ పదవుల Read more

అంబానీని మించిపోయిన జీత్ అదానీ పెళ్లి ఖర్చు
gautam

భారతదేశంలోని ప్రముఖ సంపన్న వ్యాపారుల్లో అదానీ, అంబానీలు ఉన్నారు. గడచిన ఏడాది ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిని దాదాపు రూ.5,000 కోట్లు Read more