ఇంటర్నెట్ చరిత్రలోనే అత్యంత కలకలం హ్యాకింగ్ (Data Hack) ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 బిలియన్ యూజర్ల లాగిన్ డేటా (16 billion users’ login data) అంటే యూజర్ నేమ్‌లు, పాస్వర్డ్లు – హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ డేటా నేటి డీప్ వెబ్ లేదా డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచబడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం, సైబర్ సెక్యూరిటీ సంస్థలు తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఏర్పడింది.
URLల ద్వారా డేటా చోరీ
సైబర్ నిపుణుల ప్రకారం, ఈ డేటా URLల ద్వారా స్క్రాపింగ్ చేసి చోరీ చేసినట్లు కనిపిస్తోంది. పలు వెబ్సైట్లు, లాగిన్ పేజీల్లో రక్షణ లోపాలను గుర్తించిన హ్యాకర్లు, వాటిని వినియోగించి లాగిన్ సమాచారాన్ని సమీకరించారు. ముఖ్యంగా పాత పాస్వర్డ్లు, రెండు స్థాయిలు భద్రత (2FA) లేకుండా ఉన్న ఖాతాలు అత్యధికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ప్రముఖ సేవలైన ఇమెయిల్, సోషల్ మీడియా, ఫైనాన్స్ అకౌంట్లు లక్ష్యంగా దాడులు జరిగినట్లు అంచనా.
యూజర్లకు నిపుణుల సూచనలు
ఈ పరిస్థితుల్లో పాస్వర్డ్లు తక్షణమే మార్చాలి, యూనిక్ మరియు కాంప్లెక్స్‌గా ఉండేలా సెట్ చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కే పాస్వర్డును అన్ని ఖాతాల్లో వాడకూడదని, ప్రతీ ఖాతాకు వేరే పాస్వర్డ్ వాడాలంటున్నారు. పాస్వర్డ్ మేనేజర్లు, రెండు స్థాయిల భద్రత వంటి సాంకేతిక సాధనాలు ఉపయోగించడం కూడా ఎంతో మేలు చేస్తుందని వారు సూచిస్తున్నారు. ఈ సైబర్ ప్రమాదం భవిష్యత్తులో మరింత తీవ్రతరమవకుండా ఉండేందుకు యూజర్ల జాగ్రత్తలు అత్యంత అవసరం.
Read Also : Banakacharla Project : తెలంగాణ ప్రభుత్వాన్ని ఆహ్వానించిన చంద్రబాబు