14 days remand to former MP Nandigam Suresh in the case of murder of a woman

మహిళ హత్య కేసు..మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు 14 రోజుల రిమాండ్

అమరావతి: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేశ్ ప్రస్తుతం వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్య కేసును కూడా ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ మహిళ హత్య కేసులో నందిగం సురేశ్ ను పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు సురేశ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది.

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సరేష్ ను హత్య కేసులో తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. 2020లో వెలగపూడిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ అనే మహిళ మరణించింది. అప్పట్లో ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేశారు. అప్పట్లో ఎంపీ నందిగం సురేష్ పేరును కూడా కేసులో చేర్చారు. అయితే వైఎస్సార్సీపీ అధికారంలో ఉండటంతో కేసు విచారణ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు విచరాణ ప్రారంభమైంది.

టీడీపీ కార్యాలయంలపై దాడి కేసులో అరెస్టైన నందిగం సురేష్‌ ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే పీటీ వారెంట్ పెండింగ్​లో ఉండటంతో సురేష్ విడుదల కాలేదు. ఆయన్ను వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో అరెస్టు చేసేందుకు తుళ్లూరు పోలీసులు మంగళగిరి కోర్టులో పీటీ వారెంట్ కోసం దరఖాస్తు చేశారు. మంగళగిరి న్యాయస్థానం పీటీ వారెంట్ కు అనుమతించడంతో తుళ్లూరు పోలీసులు ఇవాళ నందిగం సురేష్ ను గుంటూరు జిల్లా జైలు నుంచి తరలించారు. మంగళగిరి న్యాయస్థానంలో నందిగం సురేష్ ను ప్రవేశ పెట్టారు. తాజాగా న్యాయస్థానం ఈనెల 21 వరకు ఆయనకు రిమాండ్‌ విధించింది.

Related Posts
వంశీతో జగన్ ములాఖత్
వంశీతో జగన్ ములాఖత్

విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలిసారు. ఈ సందర్భంలో, జగన్ బెంగళూరులోని Read more

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన

జనవరి 21 నుండి 23 వరకు దావోస్‌లో జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు Read more

సోదరుడి మరణంతో తీవ్ర భావోద్వేగాలకు గురైన జయప్రద
jayapradanews

ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద తన సోదరుడు రాజబాబు మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు Read more

జానీ మాస్టర్‌కు రంగా రెడ్డి జిల్లా కోర్టులో స్వల్ప ఊరట
Johnny Master in police custody

Ranga Reddy District Court got a little relief for Johnny Master హైదరాబాద్‌: తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఓ యువతిపై Read more