ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్‌షహర్‌లో ఓ 30 ఏళ్ల మహిళ కడుపు నొప్పితో ఆసుపత్రిని ఆశ్రయించింది. అయితే ఆమెకు సాధారణ గర్భధారణ కాదు, లివర్లో పిండం (Fetus in the liver) ఉండటం చూసి వైద్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. స్కాన్ చేసిన తర్వాత 12 వారాల పిండం లివర్లోనే వృద్ధి చెందుతోందని తేలింది. గర్భాశయంలో కాకుండా, ఇలా లివర్లో పిండం పెరగడం అత్యంత అరుదైనది.
దేశంలోనే ఇది తొలి కేసు
వైద్యుల కథనం ప్రకారం.. ఇది భారత్‌లో నమోదైన తొలి కేసుగా నమోదైంది. అంతర్జాతీయంగా ఇప్పటి వరకు ఇలాంటివి కేవలం 18 మాత్రమే ఉన్నాయని చెప్పారు. సాధారణంగా గర్భధారణ గర్భాశయంలో జరుగుతుంది. కానీ ఈ సందర్భంలో పిండం గర్భాశయాన్ని దాటి లివర్లో అమరిపోయి వృద్ధి చెందడం అత్యంత అరుదైన పరిస్థితిగా పేర్కొన్నారు.
తల్లి ప్రాణాలకు ముప్పు, వెంటనే శస్త్రచికిత్స అవసరం
ఈ పరిస్థితిని విపరీతంగా శరీరాన్ని ప్రభావితం చేయగలదని, ముఖ్యంగా 14 వారాల తరువాత తల్లి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరించారు. దీంతో, ఆ మహిళను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ స్పెషలిస్టుల పర్యవేక్షణలో పిండాన్ని తొలగించే శస్త్రచికిత్స చేపట్టనున్నారు. ఇది వైద్యరంగంలో ఓ రేర్ కేస్‌గా చర్చనీయాంశమవుతోంది.
Read Also : Annadata sukhibhava – PM Kisan : కౌలు రైతులకు ఒకేసారి రెండు విడతల సాయం!