12 day remand for the accused in the ration rice misappropriation case

రేషన్ బియ్యం మాయం కేసు..నిందితులకు 12 రోజుల రిమాండ్

విజయవాడ: మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్ విధించారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన సతీమణి పేర్ని జయసుధకి చెందిన గోడౌన్ లో బియ్యం మాయం కేసులో స్పెషల్ మొబైల్ జడ్జి నిందితులకు 12 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం నిందితులను మచిలీపట్నం సబ్ జైలుకు పోలీసులు తరలించారు. ఈ కేసులో పేర్ని జయసుధకు చెందిన గోడౌన్ మేనేజర్ మానస తేజ, సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బోట్ల మంగారావు నిందితులుగా ఉన్నారు. వీరిని పోలీసులు సోమవారం రాత్రి 11గంటల సమయంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

Advertisements

గోడౌన్‌లో బియ్యం మాయం కేసులో A1గా ఉన్న పేర్ని జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించారన్న ఆరోపణలపై సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డిపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ2గా బ్యాంక్ ఎకౌంట్ నగదు లావాదేవీల ఆధారంగా రైస్ మిల్లర్ ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావులను పోలీసులు అరెస్ట్ చేశారు. రైస్ మిల్లర్ బ్యాంక్ ఖాతా నుండి A2 మానస తేజ బ్యాంక్ ఎకౌంట్‌కు రూ. 24 లక్షలు బదిలీ అయినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రైస్ మిల్లర్ బ్యాంక్ అకౌంట్ నుంచి లారీ డ్రైవర్ ఖాతాలకు రూ.16 లక్షలు బదిలీ అయినట్టు పోలీసులు గుర్తించారు.

Related Posts
నేడు నాంపల్లి కోర్టు ముందు హాజరుకానున్న నాగార్జున
Defamation suit against Konda Surekha. Nagarjuna to appear in court tomorrow

నేడు నాంపల్లి కోర్టు ముందు హాజరుకానున్న నాగార్జున హాజరుకాబోతున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున తో పాటు ఆయన మాజీ కోడలు పై చేసిన వ్యాఖ్యలకు Read more

మహారాష్ట్ర విజయం తరువాత, ప్రధాని మోడీ బీజేపీ కార్యకర్తలకు ప్రసంగించేందుకు సిద్ధం..
MODI AT BJP HEADQUATERS

మహారాష్ట్రలో ఘనమైన విజయం సాధించిన అనంతరం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంలో, పార్టీ కార్యకర్తలకు ఆయన ప్రసంగించేందుకు Read more

సీఎం రేవంత్ ఎమోష‌న‌ల్
cm revanth

మూసీ పునరుజ్జీవంపై సీఎం రేవంత్ ఎమోషనల్ అయ్యారు. హైద‌రాబాద్ కు మూసీ వ‌రం కావాలి కానీ శాపం కావ‌ద్దొని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. న‌దుల వెంట Read more

ఎమ్మెల్యే కొలికపూడిని సస్పెండ్ చేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు
tiruvuru women protest agai

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును టీడీపీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ చిట్టేల గ్రామంలో సోమవారం మహిళలు రోడ్లపై నిరసనకు దిగారు. అనూహ్యంగా ఎమ్మెల్యే Read more