న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జనవరి 2025లో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ) ఎన్‌వీఎస్-02 ప్రయోగం చేపట్టనున్నది. ఈ మిషన్ కోసం సన్నాహాలు చేస్తుంది. వచ్చే ఏడాది ప్లాన్ చేసిన పలు మిషన్‌లో జీఎస్‌ఎల్‌వీ మిషన్ ఒకటని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ తెలిపారు. ఇస్రో సోమవారం రాత్రి విజయవంతంగా స్పాడెక్స్ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సోమ్‌నాథ్ ఈ ప్రకటన చేశారు.
మే 29, 2023న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 రాకెట్ ఎన్‌ఎస్‌వీ-01 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టిందని సోమ్‌నాథ్ పేర్కొన్నారు. ఎన్‌వీఎస్-04 ఉపగ్రహంలో స్వదేశీ అటామిక్ క్లాక్ ఉంటుందన్నారు. ఇది ఇండియన్ కాన్స్టెలేషన్ (NAVIC)తో నావిగేషన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు. కవరేజ్ కోసం ఎల్1 బ్యాండ్ సిగ్నల్ కలిగి ఉంటుందన్నారు. ఎన్‌వీఎస్-2 మిషన్‌తో మరింత పురోగతి సాధించాలని భావిస్తున్నామన్నారు. అధునాతన ఫీచర్స్‌తో నావిక్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు.
ఇస్రో చీఫ్ ఈ సందర్భంగా చంద్రయాన్-4 మిషన్‌పై కీలక సమాచారాన్ని వెల్లడించారు. మిషన్‌లో వివిధ మాడ్యూల్స్ ఉంటాయని.. వేర్వేరు సమయాల్లో ప్రయోగించనున్నట్లు తెలిపారు. రెండు వేర్వేరు మాడ్యూల్స్‌లో ఒకేసారి కలుపనున్నట్లు తెలిపారు. ఈ మాడ్యూల్స్ కక్షలోకి చేరుకోవాల్సి ఉంటుందని.. ఆ తర్వాత భూమి కక్ష్య, చంద్రుడి కక్ష్యలో రెండింటిలోనూ డాక్ చేయాల్సి ఉంటుందన్నారు. చంద్రుడిపై దిగి విజయవంతంగా తిరిగి రావడమే చంద్రయాన్-4 లక్ష్యమని సోమ్‌నాథ్ స్పష్టం చేశారు.