10,౦౦౦ మందికి కాగ్నిజెంట్ ఉద్వాసన!

10,౦౦౦ మందికి కాగ్నిజెంట్ ఉద్వాసన!

కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ ఉద్యోగాల కొత ఐటి పరిశ్రమను కూడా తాకింది. పరిస్థితులు కోవిడ్ నుండి సాధారణ స్థాయికి వచ్చాక కూడా ఉద్యోగాల కోతలు వెంటాడుతూనే ఉన్నాయని తెలుస్తుంది. అంతేకాదు మరోవైపు గత ఏడాది కాలంలో కాగ్నిజెంట్ టెక్నాలజీస్‌లో 10,000 మందికి పైగా ఉద్యోగులు వారి ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు వెల్లడైంది. ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన నివేదిక ప్రకారం, అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ టెక్నాలజీ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీని విడిచిపెట్టిన ఉద్యోగుల సంఖ్య 10,700 అని తెలిపింది. మరోవైపు కాగ్నిజెంట్ ఉద్యోగుల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది.

10,౦౦౦ మందికి కాగ్నిజెంట్ ఉద్వాసన!

దీనికి సంబంధించి కాగ్నిజెంట్ ఈ సంవత్సరం అంతా కొత్త ఉద్యోగులను నియమించుకుంటుందని ఓ ముఖ్య ఆర్థిక అధికారి తెలిపారు. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,36,800. గత 12 నెలల్లో పోల్చి చూస్తే కాగ్నిజెంట్ నుండి రాజీనామా చేసిన వారి సంఖ్య 15.9 శాతం. అంతేకాదు కంపెనీ యుటిలైజేషన్ రేటు 2 శాతం పాయింట్లు తగ్గి 82%కి చేరుకుంది.

కాగ్నిజెంట్ సీఈవో ఏమంటున్నారంటే…

అయితే, 2024 అంతటా యుటిలైజేషన్ మెరుగుదలలు బలంగా ఉన్నాయని యాజమాన్యం హైలైట్ చేసింది.
కాగ్నిజెంట్ సీఈఓ ఏమన్నారంటే కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ మాట్లాడుతూ, గతంలో కంపెనీని విడిచిపెట్టిన చాలా మంది ఉద్యోగులు తిరిగి కంపెనీకి వస్తున్నారని అన్నారు. గత ఏడాది 2024లోనే కాగ్నిజెంట్‌ను విడిచిపెట్టిన దాదాపు 13,000 మంది ఉద్యోగులు తిరిగి కంపెనీలో చేరారని ఆయన పేర్కొన్నారు. మరో 10,000 మంది కాగ్నిజెంట్‌లో మళ్ళీ చేరడానికి ఆసక్తిగా ఉన్నారని ఆయన చెప్పారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలుపుకోవడంలో మా కంపెనీ అద్భుతంగా ఉందనడంలో దీని ద్వారా తేలిందని రవికుమార్ అన్నారు. కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుండగా దీని పోటీదారు యాక్సెంచర్ మాత్రం నిరంతరం కొత్త ఉద్యోగులను నియమించుకుంటోంది.

Related Posts
జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను ఇస్తాం: కేంద్ర మంత్రి
జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను ఇస్తాం: కేంద్ర మంత్రి

జమ్మూ కాశ్మీర్‌కు తగిన సమయంలో రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు శనివారం Read more

యడ్యూరప్పకు బెయిల్ పొడిగించిన హైకోర్టు
yediyurappa

కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు బెయిల్ పొడిగిస్తూ, ట్రయల్ కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో Read more

గుజరాత్‌లో కుటుంబం కోసం జోమాటో డెలివరీ చేస్తున్న తల్లి..
gujarat delivery

గుజరాత్ రాష్ట్రం, రాజకోట్ నగరంలో ఒక అనుబంధమైన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మహిళా జోమాటో డెలివరీ భాగస్వామి తన చిన్న బిడ్డను ముందు Read more

సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం
Sukhbir Singh Badal shot in

శిరోమణి అకాలీదళ్ చీఫ్, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై బుధవారం హత్యాయత్నం చోటుచేసుకుంది. ఈ ఘటన అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయం వెలుపల జరిగింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *