10 Children Killed As Fire Breaks Out At Hospital In UPs Jhansi

యూపీలోని ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది చిన్నారుల సజీవదహనం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కాలేజీలోని నియోనటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది మంది చిన్నారులు సజీవదహనమయ్యారు. మంటలు చెలరేగిన వార్డులో 47 మంది నవజాత శిశువులు ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే 31 మంది నవజాత శిశువులను సురక్షితంగా తరలించినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఇక 16 మంది చిన్నారులు పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం రాత్రి 10.45 గంటలకు మంటల చెలరేగడంతో రోగులు, దవాఖాన సిబ్బంది ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలను రక్షించుకోవడానికి బయటకు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నది. ఈ ఘటన జరిగిన సమయంలోఎన్‌ఐసీయూలో మొత్తం 54 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు.

కాగా, శిశువుల మృతితో ఆస్పత్రి ఆవరణలో హృదయవిదారక వాతావరణం నెలకొంది. తమ బిడ్డలు సురక్షితంగా ఉన్నారా.. లేదా అని తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని అధికారులు భావిస్తున్నారు. మిగిలిన రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Related Posts
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్
రూ.89 వేలు దాటిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.450 పెరిగి రూ.80,650కి చేరుకుంది. ఇదే సమయంలో, 24 క్యారెట్ల Read more

డాన్స్ స్టెప్పులతో దుమ్ము లేపిన మల్లారెడ్డి
Malla Reddy Dance Video 1024x576 1

హైదరాబాద్‌లోని మనవరాలి సంగీత్‌ ఫంక్షన్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి అద్భుతమైన నృత్య ప్రదర్శన చేసి సంచలనం సృష్టించారు. డీజే టిల్లు పాటలకు ఆయన చేసిన మాస్ స్టెప్పులు Read more

వధువులు అందంగా కనిపించేందుకు యాస్మిన్ కరాచీవాలా చిట్కాలు..
Yasmin Karachiwala shares 5 tips for brides to look their best on their wedding day

ప్రతి వధువు తమ పెళ్లి రోజున అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దాని కోసం పరితపిస్తుంది. అయితే, పెళ్లి రోజు కోసం చేసే ప్రణాళిక, షాపింగ్ మరియు ఆహ్వానాలు Read more

ఏఐ సాంకేతికకు తెలంగాణ మద్దతు
Telangana support for AI technologies

హైదరాబాద్ : స్టార్టప్‌లు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నాయని, సామాజిక ప్రభావాన్ని పెంచే ఏఐ సొల్యూషన్స్‌కు మద్దతు ఇవ్వడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *