భారత ప్రభుత్వంపై ఎక్స్ దావా: న్యాయపోరాటం ప్రారంభమా?

హెచ్-1బీ వీసాపై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు

జనవరిలో అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ పాలనలో కీలక భాగస్వామి కాబోతున్న బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హెచ్-1బీ వీసాపై మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అత్యుత్తమ ప్రతిభావంతులకు అమెరికా ఒక గమ్యస్థానంగా ఉండాలని, నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులను అమెరికాకు తీసుకురావడానికి ఉపయోగిస్తున్న హెచ్-1బీ వీసా విధానం విచ్ఛిన్నమైందని, భారీ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisements
Elon Musk


కనిష్ఠ వేతనం
‘‘కనిష్ఠ వేతనాన్ని గణనీయంగా పెంచడం, హెచ్-1బీ వీసా నిర్వహణ వార్షిక వ్యయాన్ని జోడించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ఇలా చేస్తే దేశీయులను కాదని విదేశీయులను రిక్రూట్ చేసుకోవడం మరింత ఖరీదైనదిగా మారిపోతుంది’’ అని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు.

అయితే హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ అందుకు ఒక మార్గం కాకూడదంటూ ‘ఎక్స్’ వేదికగా ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ఈ ట్వీట్‌పై ఎలాన్ మస్క్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, హెచ్-1బీ వీసాలను రక్షించడానికి యుద్ధానికి వెళతానంటూ ఎలాన్ మస్క్ ఈ మధ్యే వ్యాఖ్యానించారు. ఈ విషయమై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులతో కూడా ఇటీవల ఆయన గొడవకు దిగారు.
భారీ సంస్కరణాలు
ట్రంప్ ప్రభుత్వంలో భాగస్వాములు కాబోతున్న ఎలాన్ మస్క్‌తో పాటు భారతీయ-అమెరికన్ టెక్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి కూడా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌కు మద్దతు తెలుపుతున్నారు. అయితే, భారీ సంస్కరణాలు తీసుకురావాల్సి ఉందని అంటున్నారు. ఎలాన్ మస్క్ హెచ్-1బీ వీసా ద్వారానే దక్షిణాఫ్రికా నుంచి అమెరికాకు వలస వెళ్లారు.

Related Posts
London :హీత్రూలో విమానాల రద్దుతో లక్షలాది మందిపై ప్రభావం
హీత్రూలో విమానాల రద్దుతో లక్షలాది మందిపై ప్రభావం

లండన్ హీత్రూ విమానాశ్రయంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వందలాది విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యూరప్‌లోని అతిపెద్ద ప్రయాణ కేంద్రాల్లో ఒకటైన హీత్రూ, Read more

అందుబాటులో కన్యాకుమారి గ్లాస్ బ్రిడ్జి
glass bridge

మరికొన్ని గంటల్లో కొత్త ఆశయాలు, కోరికలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి కొత్త ఏడాది వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు Read more

Pakistan girl: సిక్స్ లు బాదేస్తున్న పాకిస్థాన్ బాలిక
Pakistan girl: సిక్స్ లు బాదేస్తున్న పాకిస్థాన్ బాలిక

రోహిత్ శర్మ స్టయిల్ షాట్లతో ఆకట్టుకుంటున్న పాకిస్థాన్ బాలిక పాకిస్థాన్‌కు చెందిన ఆరేళ్ల బాలిక సోనియా ఖాన్ తన అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో Read more

Chiranjeevi : జీవిత సాఫల్య పుర‌స్కారం అందుకున్న మెగాస్టార్‌
Megastar receives lifetime achievement award

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లండన్‌లో ఉన్న విషయం తెలిసిందే. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌.. యూకే పార్లమెంట్‌లో చిరంజీవిని ఘనంగా సత్కరించారు. 'లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌' Read more

×