116008039

సూపర్ స్టార్ దర్శన్ కు బెయిల్

ప్రముఖ కన్నడ నటుడు, శాండిల్‌వుడ్ సూపర్ స్టార్ దర్శన్ తూగుదీపకు ఊరట లభించింది. రేణుక స్వామి హత్యకేసులో అరెస్టయిన ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే కర్ణాటక హైకోర్ట్ ఆయనకు ఈ బెయిల్‌ను ఇచ్చింది.
అలాగే- ఇదే కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ నటి పవిత్ర గౌడ, మరో 15 మంది నిందితులకూ షరతులతో కూడిన బెయిల్ లభించింది. ప్రస్తుతం దర్శన్ తాత్కాలిక బెయిల్‌పై ఉన్నారు. బళ్లారి సెంట్రల్ జైలులో అనారోగ్యానికి గురైన నేపథ్యంలో న్యాయస్థానం ఆయనకు ఆరు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు కర్ణాటక హైకోర్టు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది.
ఈ కేసు జాతీయ స్థాయిలోనే త్రీవ సంచలనంగా మారినవిషయం తెలిసేందే.
తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దర్శన్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎస్ విశ్వజిత్ షెట్టి సారథ్యంలోని బెంచ్ దీనిపై విచారణ చేపట్టింది. దర్శన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ సీవీ నగేష్ వాదించారు. వాదోపవాదాలను ఆలకించిన తరువాత తీర్పును డిసెంబర్ 9వ తేదీన రిజర్వ్ చేశారు న్యాయమూర్తి. తాజాగా దాన్ని వెల్లడించారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌.. ప్రధాన నిందితుడు. కన్నడ నటి పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అసభ్యకర, అశ్లీలకరమైన పోస్టులు, కామెంట్స్ చేస్తుండేవాడనే కారణంతో రేణుకా స్వామిపై కక్ష పెంచుకుని సుపారీ ఇచ్చి అతణ్ని హత్య చేయించాడనే ఆరోపణలపై ఈ ఏడాది జూన్ 11వ తేదీన అరెస్ట్ అయ్యారు. దర్శన్, పవిత్ర గౌడ, మరో 15 మంది పేర్లపై పోలీసులు ఛార్జిషీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 3,991 పేజీల ఛార్జ్‌షీట్ ఇది. ఇందులో ఏ1గా పవిత్ర గౌడ, ఏ2గా దర్శన్‌‌ పేర్లను నమోదు చేశారు. బెంగళూరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం ఈ ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు అందజేసింది.

Related Posts
గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించండి: రాహుల్ గాంధీ
rahul gandhi

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహా కుంభ మేళా 2025లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ Read more

ఉత్తరప్రదేశ్‌ ఆసుపత్రిలో మంటలు: 10 చిన్నారులు మృతి
fire

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం ఓ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 10 చిన్నారులు మృతి చెందారు.ఈ సంఘటన మరింత విషాదంగా మారింది, Read more

మహారాష్ట్రలో వణుకు పుట్టిస్తున్న ‘జీబీఎస్’ వైరస్
gbs syndrome

దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ (GBS) కలవరపెడుతోంది. తొలుత మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌‌లో వెలుగులోకి వచ్చిన జీబీఎస్.. క్రమంగా మిగతా రాష్ట్రాలకు విస్తరిస్తుంది. ఉహించిన దానికంటే వేగంగానే Read more

‘Operation Brahma’ : మయన్మార్కు భారత్ సాయం
Operation Brahma start

అత్యంత తీవ్రమైన భూకంపాలతో మయన్మార్ తీవ్రంగా నష్టపోయింది. అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు, వందలాది భవనాలు నేలకొరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో మయన్మార్‌కు సహాయంగా భారత్ ‘ఆపరేషన్ బ్రహ్మ’ Read more