sukumar

సినిమాలను వదిలేయాలనుకుంటున్నా సుకుమార్

పుష్ప 2 వసూళ్ల పరంగా రికార్డులు తిరగరాస్తున్నా, ఈ చిత్ర బృందం ఆనందం ఆస్వాదించే స్థితిలో లేదు.ఈ సినిమా ఇప్పటికే రూ. 1600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినా, సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన కారణంగా చిత్ర బృందం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పుష్ప 2 ప్రీమియర్ షోల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఒక చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. ఈ ఘటన తర్వాత హీరో అల్లు అర్జున్ అనుకోకుండా వివాదాల కేంద్రమయ్యాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేయడం,బీఆర్ఎస్, బీజేపీ నేతల నుంచి కఠిన విమర్శలు రావడం ఈ వివాదాన్ని మరింత పెంచింది.ఈ వివాదాలు సినిమా పరిశ్రమను కుదిపేస్తుండగా, పుష్ప 2 సక్సెస్ పైన ఈ సమస్య మబ్బులా కమ్మేసింది.ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ చేసిన వ్యాఖ్యలు షాకింగ్‌గా మారాయి.

అమెరికాలో ఇటీవల జరిగిన రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ ఈవెంట్‌లో‘ధోప్’అనే లిరిక్ సాంగ్‌ను విడుదల చేశారు.‘ధోప్’ అంటే వదిలేయడం అని అర్థం.ఈ నేపధ్యంలో యాంకర్ సుమ సుకుమార్‌ను ఉద్దేశిస్తూ,“మీరు ఈ రోజు ఏం వదిలేయాలనుకుంటున్నారు?” అని ప్రశ్నించగా, సుకుమార్ అనుకోని మాట చెప్పారు.“సినిమాలను వదిలేయాలని అనిపిస్తోంది”అని ఆయన స్పందించారు.ఈ వ్యాఖ్యతో పక్కనే ఉన్న రామ్ చరణ్ షాక్ అయ్యాడు.సుకుమార్‌ని తలతిప్పి చూస్తూ, “అలా చేయరులే!” అనే సైగ చేశాడు. ఈ సంఘటనపై అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బహుశా ప్రస్తుత వివాదాల వల్ల సుకుమార్ భావోద్వేగానికి లోనై ఇలా మాట్లాడి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు.సుకుమార్ వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. పుష్ప 2 బృందం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులు దర్శకుడి భావోద్వేగాన్ని ప్రతిబింబిస్తున్నాయని అభిమానులు భావిస్తున్నారు.

Related Posts
తన కాబోయే భార్య శోభితా ధూళిపాళతో కలిసి పోజులిచ్చిన నాగ చైతన్య
naga chaitanya shobhitha

టాలీవుడ్ నటుడు నాగ చైతన్య నటి శోభిత ధూళిపాళతో ఇటీవల నాగార్జున నివాసంలో జరిగిన సన్నిహిత వేడుకలో తమ నిశ్చితార్థాన్ని ఘనంగా జరుపుకున్నారు చాలా కాలంగా చైతన్య Read more

సూర్య కొత్త పోస్టర్: రెట్రో
సూర్య కొత్త పోస్టర్: రెట్రో

సూర్య తన రాబోయే చిత్రం "రెట్రో" యొక్క కొత్త అప్‌డేట్‌తో 2025ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని చివరి విడుదలైన "కంగువ" ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. Read more

తమన్ వ్యాఖ్యలు హృదయాన్ని తాకాయి: చిరంజీవి
తమన్ వ్యాఖ్యలు హృదయాన్ని తాకాయి: చిరంజీవి

ప్రస్తుత కాలంలో సినిమాల చుట్టూ వృద్ధిచెందిన ప్రతికూలత మరియు ట్రోలింగ్ ధోరణికి వ్యతిరేకంగా ఇటీవల వ్యాఖ్యానించిన సంగీత దర్శకుడు తమన్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ముందుకు Read more

మోహన్‌బాబు బెయిల్‌ను తిరస్కరించిన హైకోర్టు!
మోహన్‌బాబు బెయిల్‌ను తిరస్కరించిన హైకోర్టు!

మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కొన్ని వారాల క్రితం తన నివాసంలో మీడియా జర్నలిస్ట్‌పై Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *