టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా మొదటి రోజే సంచలన కలెక్షన్లు సాధించి, ప్రేక్షకులను ఆకట్టుకుంది. వెంకటేశ్, అనిల్ రావిపూడిల సూపర్ హిట్ కాంబో ఇప్పటికే “ఎఫ్2”, “ఎఫ్3” చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు అదే విజయ పరంపరను కొనసాగిస్తూ “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది.

ప్రత్యేకంగా కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి, వెంకటేశ్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సక్సెస్‌ను జరుపుకుంటూ చిత్ర బృందం ఓ ప్రత్యేక పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “పండగకి వచ్చారు..
పండగని తెచ్చారు” అంటూ అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.తెలుగు రాష్ట్రాలకే పరిమితమయ్యకుండా, ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకు భారీ స్పందన వచ్చింది. అక్కడ తొలి రోజే సుమారు 7 లక్షల డాలర్లు వసూలు చేసింది. వెంకటేశ్ కెరీర్‌లో ఓవర్సీస్‌లో ఇంతటి కలెక్షన్లు సాధించిన మొదటి సినిమా ఇదేనని చిత్ర బృందం వెల్లడించింది.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌లు హీరోయిన్లుగా నటించగా, వీటీవీ గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, రఘుబాబు, ప్రియదర్శి, మురళీధర్, పృథ్వీ రాజ్, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.