Gudivada Amarnath

వైసీపీ వల్లే విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ ఆగింది : అమర్నాథ్‌

విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేయడం వల్లే ప్రైవేటీకరణ ఆగిందని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పేర్కొన్నారు. ప్లాంట్‌ను కాపాడాలని ఉద్దేశ్యం ఉంటే ప్రైవేటీకరణ జరగదని ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేయడం వల్లే ప్రైవేటీకరణ ఆగిందని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో శనివారం మాట్లాడారు.

Advertisements

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైఎస్‌ జగన్‌ వ్యతిరేకమని తెలిపారు. నిన్న కేంద్రం విశాఖ స్టీల్‌కు ప్రకటించిన రూ. 11,440 కోట్ల ప్యాకేజీ కేవలం ఆక్సిజన్‌లా పనిచేస్తుందని అన్నారు. కేంద్రం ఇచ్చే ప్యాకేజీ కేవలం అప్పులకే సరిపోతుందని వెల్లడించారు. స్టీల్‌ ప్లాంట్‌ అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉందని తెలిపారు. ప్లాంట్‌ను కాపాడాలని ఉద్దేశ్యం ఉంటే ప్రైవేటీకరణ జరగదని ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. స్టీల్‌ ప్లాంట్‌కు ట్యాక్స్‌ హాలీడే ఇవ్వాలని, ప్లాంట్‌ను సేయిల్‌లో విలీనం చేయాలని, సొంతంగా గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కూటమి పాలన వచ్చిన తరువాత కార్మికులకు జీతాలు ఇవ్వలేదని, ఉద్యోగులను తొలగించారని ఆరోపించారు.

Related Posts
Raghurama Krishna Raju : ఉండిలో హాజరైన డిప్యూటీ స్పీకర్ రఘురామ
Raghurama Krishna Raju : ఉండిలో హాజరైన డిప్యూటీ స్పీకర్ రఘురామ

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి ప్రాంతం ఈసారి ఆక్వా రైతులతో కిటకిటలాడింది అక్కడ జరిగిన ఆక్వా రైతుల సమ్మేళనంలో రైతుల సమస్యలు ప్రభుత్వ ప్రణాళికలపై చర్చ Read more

Ganta Srinivasa Rao : వైజాగ్ ఫిల్మ్ క్లబ్ దారి తప్పిందన్న గంటా
Ganta Srinivasa Rao వైజాగ్ ఫిల్మ్ క్లబ్ దారి తప్పిందన్న గంటా

విశాఖ ఫిల్మ్ క్లబ్ దిశ తప్పిందని దీనిని తిరిగి పటిష్టంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు స్పష్టం చేశారు. Read more

తిరుమల లడ్డు కేసులో నలుగురి అరెస్టు
తిరుమల లడ్డు కేసులో నలుగురి అరెస్టు

తిరుమల లడ్డు కేసులో నలుగురి అరెస్టు.తిరుమల ఆలయంలో పవిత్ర లడ్డు కల్తీకి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. ఈ కేసులో Read more

‘మద్యం’ విషయంలో మాట మార్చిన తెలుగు సీఎంలు
wineprice

మద్యం ధరలు పెరిగిన నేపథ్యంలో వినియోగదారులు ఆగ్రహంతెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరల పెంపు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ‘మద్యం' విషయంలో మాట మార్చిన తెలుగు సీఎంలు.ఎన్నికల Read more

×