duvvada srinivas

వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ‌పై కేసు న‌మోదు

వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు అవ్వడం , పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. తాజాగా వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ టెక్కలి నియోజకవర్గ జనసేన నాయకుడు కణితి కిరణ్ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టెక్కలి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ వెంట‌నే దువ్వాడ‌ను విచార‌ణ‌కు రావాల్సిందిగా నోటీస్ లు పంపారు. దివ్వెల మాధురితో సాన్నిహిత్యం కారణంగా గత కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేరు తరచుగా మీడియాకెక్కుతోంది. తాజాగా మరోసారి ఆయన పేరు తెరపైకి వచ్చింది.

శ్రీనివాస్ విషయానికి వస్తే.. మొదటగా దువ్వాడ శ్రీనివాస్‌ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2001లో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా, 2006లో శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేశాడు. దువ్వాడ శ్రీనివాస్‌ 2009లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమిపాలై, 36552 ఓట్లతో మూడవస్థానంలో నిలిచాడు. దువ్వాడ శ్రీనివాస్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో టెక్కలి నియోజకవర్గం అసెంబ్లీకి పోటీ చేసి 8387 ఓట్ల తేడాతో, 2019లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి 6,653 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.

దువ్వాడ శ్రీనివాస్ ను వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 2021 ఫిబ్రవరి 25న ఖరారు చేశాడు. ఆయన శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయినట్లు 2021 మార్చి 8న ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తెలిపాడు. ఆయన శాసనసభ్యుడిగా 2021 ఏప్రిల్ 1న ప్రమాణ స్వీకారం చేశాడు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం తో రాజకీయాలపై కంటే మాధురి పై ఎక్కువ ఫోకస్ పెట్టి మరింత గా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.

Related Posts
డోనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ
PM Modi spoke to Donald Trump on phone

న్యూఢిల్లీ: భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అమెరికా 47వ దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైన రిప‌బ్లిక‌న్ నేత డోనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలో ప్రధాని భార‌త్‌, అమెరికా Read more

ఏపీ పిల్లల కోసం మోడల్ స్కూల్స్: మంత్రి నారా లోకేశ్
ఏపీ పిల్లల కోసం మోడల్ స్కూల్స్: మంత్రి నారా లోకేశ్

దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. Read more

ఎమ్మెల్సీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం !
Pawan Kalyan key decision on MLC elections!

అమరావతి: ఏపీలో ఎమ్మెల్సీకలకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎన్నికల బరిలో నిలిచేది Read more

నేటి నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ధరలు
registration charges

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా భూక్రయ విక్రయాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు మరియు ఇతర లావాదేవీలు పెరిగాయి. చార్జీల పెంపు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *