nara lokesh

వైపీసీవల్లే గ్యారంటీలు ఆలస్యం: లోకేష్

గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే 6 గ్యారంటీలు ఆలస్యం అవుతున్నాయని ఐటీ, విద్యామంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ బకాయిలను తాము చెల్లిస్తున్నామన్నారు. ప్రతి నెల రూ.4 వేల కోట్ల లోటు బడ్జెట్ తో ప్రభుత్వం నడుస్తోందన్నారు. 6 గ్యారంటీల్లో రెండు అమలు చేశామని, మరో రెండు గ్యారంటీలకు డేట్స్ ఇచ్చామన్నారు. 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని లోకేష్ తెలిపారు.


ముందుగా తల్లికి వందనం, రైతు భరోసా
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయినా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీ కేబినెట్ భేటీలో ఈ ఏడాది అమలు చేయాల్సిన పథకాలపై కీలక చర్చ జరిగింది. ఇందులో తల్లికి వందనం, రైతు భరోసా ముందుగా అమలు చేయాలని, ఆ తర్వాతే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ ఏడాది కూడా సూపర్ సిక్స్ హామీలు అమలు కావడం లేదని వైసీపీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ, విద్యామంత్రి నారా లోకేష్ ఇవాళ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు.

మంత్రి నారా లోకేష్ ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఉండి, కాళ్ళ, భీమవరం ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉండి హైస్కూల్ అభివృద్ధి పనుల్ని లోకేష్ ప్రారంభించారు. అలాగే కాళ్ల మండలం పెద ఆమిరం జువ్వలపాలెం రోడ్ లో రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

Related Posts
ఆంధ్రలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు
ఆంధ్రలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు – అధికారిక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. ఎన్డీయే కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మూడు స్థానాలకు, జనసేన ఒక Read more

జనసేన ఆవిర్భావ సభకు ‘జయకేతనం’ అనే పేరు
janasena jayakethanam

జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఈ నెల 14న గ్రాండ్‌గా నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు పూర్తి చేసింది. ఈ ప్రత్యేక సభకు ‘జయకేతనం’ అనే పేరు జనసేన Read more

ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ గ్రామ సదస్సులు ప్రారంభం
Revenue Meetings From Today in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సదస్సులు ప్రారంభమవుతాయి. వచ్చే నెల Read more

AP CM Chandrababu: రేపు మోదీతో భేటీ కానున్న చంద్రబాబు
AP CM Chandrababu: రేపు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అభివృద్ధికి మరింత ఊపందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (మంగళవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. తన ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో Read more