ttd meeting

వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ కీలక సూచనలు

త్వరలో జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ పలు కీలక సూచనలు చేసింది. జనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని టీటీడీ వెల్లడించింది. భక్తులకు కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులు తిరుమల దర్శనానికి రావాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి కోరారు. ఈ మేరకు అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు సూచనలు చేశారు.
అధికారులకు దిశానిర్దేశం
వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేయనున్న 9 కేంద్రాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా టీ, పాలు, కాఫీ పంపిణీ చేయాలని ఆదేశించారు.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా పది రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ, మొదలైన విశేష దర్శనాలు పది రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గోవింద మాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని, వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
అందుబాటులో లడ్డూలు
భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ విక్రయ కేంద్రంలో ప్రతి రోజూ 3.50 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచాలని అన్నారు. చలి తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా విశ్రాంతి గృహాల్లో వేడి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడు వేల మంది యువ శ్రీవారి సేవకులు, స్కౌట్‌ అండ్‌ గైడ్స్ సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవాలన్నారు.

Advertisements
Related Posts
 దేవరగట్టు బన్నీ ఉత్సవం .. కర్రల సమరంలో 100 మందికి గాయాలు
bunny fest

దేవరగట్టు బన్నీ ఉత్సవంలో భారీ కర్రల సమరం: వంద మందికి పైగా గాయాలు కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో ఆదివారం వేకువజామున జరిగిన బన్నీ ఉత్సవం Read more

ఏపీ సర్కార్ కు కేంద్రం సూచనా..
polavaram

పోలవరం మెయిన్ డ్యాం పనులకు కేంద్రం రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా చెల్లించడంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టు కంపెనీలు మేఘా, బావర్లను Read more

స్కూళ్లకు ఒకే యాప్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
AP Govt Schools

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖలో ప్రస్తుతం ఉన్న 45 యాప్ల స్థానంలో ఒకే యాప్‌ను తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్‌లో స్కూల్, టీచర్, స్టూడెంట్ Read more

Manda krishna: ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబుదే కీలక పాత్ర: మందకృష్ణ
Chandrababu Naidu played a key role in the unanimous resolution on SC classification.. Manda Krishna

Manda krishna: ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం చారిత్రక విజయమని అన్నారు. ఎస్సీ Read more

×