vizag gag rap

విశాఖ గ్యాంగ్ రేప్.. వెలుగులోకి కీలక విషయాలు

ఏపీలో అత్యాచారాలు ఏమాత్రం ఆగడం లేదు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కామాంధులు రెచ్చిపోతున్నారని , ఒంటరి మహిళలపై , అభంశుభం తెలియని చిన్నారులకు అత్యాచారాలకు పాల్పడుతున్నారని అప్పుడు ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారినప్పటికీ అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అత్యాచారం అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉంది.

Advertisements

తాజాగా విశాఖలో న్యాయవిద్య అభ్యసిస్తున్న ఒక యువతిపై నలుగురు సహచర విద్యార్థులు సామూహిక అత్యాచారం చేశారు. ఓ పథకం ప్రకారం ప్రేమికుడితోపాటు, మరో ముగ్గురు స్నేహితులు ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేసి ఈ దురాగతానికి పాల్పడ్డారు. బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ దారుణం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ అత్యాచారం కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ప్రేమ, పెళ్లి పేరుతో యువతికి దగ్గరైన ప్రియుడే ఆమెను వంచించాడు. వీరు ఏకాంతంగా గడిపిన వీడియోను చూపించి అతడి స్నేహితులు సైతం లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాతా తమ కోరిక తీర్చాలని వారు వేధించడం, ప్రియుడు సైతం ఫ్రెండ్స్ కోరిక తీర్చాలని ఒత్తిడి చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకోబోయింది. తండ్రి కాపాడి ప్రశ్నించడంతో విషయం బయటకొచ్చింది.

నగరానికి చెందిన ఓ యువతికి సహ విద్యార్థి వంశీతో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఈ ఏడాది ఆగస్టు 10న కంబాలకొండకు వెళ్లిన సమయంలో యువతి నిరాకరించినా వంశీ బలవంతంగా శారీరకంగా కలిశాడు. ఆగస్టు 13న వంశీ ఆ యువతిని ద్విచక్రవాహనంపై తన స్నేహితుడు ఆనంద్ గదికి తీసుకెళ్లాడు. అక్కడ బలవంతం చేసి మరోమారు శారీరకంగా కలిశాడు. దాన్ని రహస్యంగా వీడియో తీసిన ఆనంద్, రాజేష్, జగదీశ్ గదిలోకి వచ్చి ఆమెను బెదిరించారు. తరువాత ఒక్కొక్కరుగా అత్యాచారం చేశారు. నిందితుల్లో ముగ్గురు విద్యార్థులు కాగా ఒకరు ఓ ప్రైవేటు మోటార్స్ కంపెనీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నట్లు దర్యాప్తు లో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.

Related Posts
బందీలను విడిచిపెట్టండి.. హమాస్‌కు ట్రంప్ హెచ్చరిక
Release the hostages. Trumps warning to Hamas

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ గాజా ఉగ్రవాదులకు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే నాటికి బందీలను విడిపెట్టాలని, లేదంటే Read more

China : ఎగిరే ట్యాక్సీలకు చైనా అనుమతి
China ఎగిరే ట్యాక్సీలకు చైనా అనుమతి

China : ఎగిరే ట్యాక్సీలకు చైనా అనుమతి టెక్నాలజీ రంగంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఆసియా జెయింట్ చైనా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఫ్లయింగ్ Read more

కళ్లు చెదిరే జయలలిత బంగారు ‘ఖజానా’!
Confiscation of Jayalalithaa assets in case of assets beyond her income

10 వేల చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం సహా మరెన్నో ఆస్తులు చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి మాజీ సీఎం Read more

PSLV-C59 రాకెట్ ప్రయోగం వాయిదా
PSLV C59

శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఈ రోజు 4:08 నిమిషాలకు జరగాల్సిన PSLV-C59 రాకెట్ ప్రయోగం తాత్కాలికంగా వాయిదా పడింది. యూరోపియన్ శాస్త్రవేత్తలు ప్రోబో-3 ఉపగ్రహంలో సాంకేతిక Read more

×