vizagsteel

విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీపై కేంద్రం ప్రకటన

కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీపై నేడు అధికారికంగా ప్రకటన చేసింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ఇస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ బేషరతుగా ఆమోదం తెలిపినట్టు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని మోదీకి, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు భారీ ఉద్దీపన ప్యాకేజి ఇవ్వాలని నిన్నటి కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించడం తెలిసిందే.

Advertisements

విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడం పట్ల కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్యాకేజీ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు. ప్రకటించిన ప్యాకేజీలో… రివైవల్ ప్యాకేజీ కింద రూ.10,300 కోట్లు కేటాయించారని వివరించారు. ఉక్కు పరిశ్రమ నష్టాలను అధిగమించేందుకు ఈ ప్యాకేజీ ఎంతో ఉపయోగపడుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలపట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ ప్యాకేజీ ఓ నిదర్శనమని రామ్మోహన్ వివరించారు.

Related Posts
Chandrababu Naidu: ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి చంద్రబాబును ఆహ్వానించిన టీటీడీ చైర్మన్
ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి చంద్రబాబును ఆహ్వానించిన టీటీడీ చైర్మన్

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు నేడు ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిశారు. రాష్ట్ర అభివృద్ధిపై, భక్తుల సంక్షేమం గురించి చర్చించిన ఈ సమావేశంలో, Read more

కరేబియన్‌లో భారత విద్యార్ధిని గల్లంతు
కరేబియన్‌లో భారత విద్యార్థిని గల్లంతు – కుటుంబం ఆందోళనలో

అమెరికాలోని పిట్స్‌బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి అనే భారత సంతతికి చెందిన యువ విద్యార్థిని అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సుదీక్ష గత Read more

ఇంద్రకిలాద్రి అమ్మవారి చీరల స్కామ్ : హైకోర్టు కీలక ఆదేశాలు
Indrakeeladri Ammavari saree scam.. High Court issues key orders

విజయవాడ: గత ప్రభుత్వ హయాంలో ఇంద్రకీలాద్రి లో 33,686 వేల చీరలు మాయం అయినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారిన అధికారులు తీరు మారలేదని Read more

ఢిల్లీలో తీవ్ర కాలుష్యం: వాయు నాణ్యత 49 సిగరెట్ల పొగతో సమానం..
smoking

ఢిల్లీ నగరం సోమవారం ఉదయం తీవ్ర పొగతో కమ్ముకొని పోయింది.. వాయు నాణ్యత సూచిక (AQI) అనేక ప్రాంతాల్లో 1,500ని దాటింది. దీంతో, అధికారులు "గ్రేడెడ్ రెస్పాన్స్ Read more

×