jayasuda police22

విచారణకు హాజరైన పేర్ని జయసుధ

రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం బందరు తాలుకా పోలీస్ స్టేషన్‌కు పేర్ని జయసుధ వచ్చారు. తన న్యాయవాదులతో కలసి విచారణకు వచ్చిన పేర్ని జయసుధను.. రాబర్ట్‌సన్ పేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఏసు బాబు విచారిస్తున్నారు. రేషన్ బియ్యం మాయం అంశంపై పేర్ని జయసుధ నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో ఏ1గా పేర్ని జయసుధ ఉన్న సంగతి అందరికి తెలిసిందే.

Advertisements

ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధకు నిన్న నోటీసులు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరవ్వాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, పేర్ని జయసుధ మచిలీప్పట్నం మేయర్ కారులో తన న్యాయవాదులతో కలిసి పీఎస్ కు వచ్చారు. అయితే విచారణకు ఆమె తరఫు న్యాయవాదులను పోలీసులు అనుమతించలేదు. ప్రస్తుతం పేర్ని జయసుధను ఆర్.పేట సీఐ ఏసుబాబు విచారిస్తున్నారు. బందరు మండలం పొట్లపాలెంలో పేర్ని నాని .. తన భార్య పేరిట గోడౌన్లు నిర్మించారు. అందులో రేషన్ బియ్యం బఫర్ నిల్వలను ఉంచారు. ఆ క్రమంలో దస్త్రాల్లో ఉన్న బియ్యం బస్తాల నిల్వలకు.. గోడౌన్లలో ఉన్న సరకుకు భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు. దాదాపు వేలాది బియ్యం బస్తాల తేడా ఉండడంతో… పేర్ని నాని సతీమణికి నోటీసులు జారీ చేశారు.

Related Posts
ఏపీలో మార్చి 17 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు
ap10thexams

ఆంధ్రప్రదేశ్‌లో 2025 సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుండి ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఈ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వానికి పంపింది. Read more

Chandrababu: గుండె జబ్బులు నిర్ధారించే యాప్‌ను రూపొందించిన బాలుడు : చంద్రబాబు అభినందన
Chandrababu గుండె జబ్బులు నిర్ధారించే యాప్‌ను రూపొందించిన బాలుడు చంద్రబాబు అభినందన

Chandrababu: గుండె జబ్బులు నిర్ధారించే యాప్‌ను రూపొందించిన బాలుడు : చంద్రబాబు అభినందన ఏడు సెకన్లలో గుండె జబ్బులను గుర్తించగలిగే స్కిరాడియావీ (Skirradiavie) యాప్‌ను అభివృద్ధి చేసిన Read more

తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాలి : భూమన
Chandrababu should be responsible for the stampede.. Bhumana Karunakar Reddy

తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాలని అన్నారు. పశువుల మంద Read more

మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోండి: కొడాలి నాని
మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోండి: కొడాలి నాని

జగన్ సీఎంగా వున్న సమయంలో మీడియాలో తరచుగా నోరుపాడేసుకున్న మాజీ మంత్రి కొడాలి నేడు మళ్లీ మీడియాతో మాట్లాడారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే Read more

×