varma cases

వర్మ పై వరుస కేసులు..తప్పించుకోవడం కష్టమే

గత వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకొని రెచ్చిపోయిన వారు ..ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..వైసీపీ అధికారంలో ఉన్న టైములో టిడిపి , జనసేన నేతలపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం , అసభ్యకరమైన పోస్టులు పెట్టడం , ట్రోలింగ్ చేయడం వంటివి చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తుంది. ఇప్పటికే వైసీపీ నేతలను , వైసీపీ సోషల్ మీడియా టీం ను ఇలా చాలామందిని అరెస్ట్ చేయగా..దర్శకుడు వర్మను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఆయనపై వరుస కేసులు నమోదు అవ్వడమే.

Advertisements

రాంగోపాల్‌ వర్మపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్‌ స్టేషన్లో మరో కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ పై సోషల్‌ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టారని..టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. వర్మపై తగిన చర్యలు తీసుకోవాలంటూ పెదపరిమి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు నూతలపాటి రామారావు తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేశారు.

అటు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో రాంగోపాల్‌ వర్మపై సోమవారం కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్‌ సమయంలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వర్మ పోస్టు చేశారంటూ.. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. ఇలా వరుస కేసులు నమోదు అవుతుండడం తో వర్మ బయటకు రావడం కష్టమే అని అంత మాట్లాడుకుంటున్నారు.

Related Posts
జనవరి 10 నుండి వైకుంఠద్వారదర్శనం
tirumala vanabhojanam

ప్రముఖ వైష్ణవాలయాలలో వైకుంఠద్వార దర్శనాలకు సమయం సమీపిస్తోంది. పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా, ద్వాదశిని వైకుంఠద్వాదశిగా ప్రసిద్ధి. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో Read more

పవన్ కల్యాణ్ భద్రతపై జనసేన ఆందోళన
పవన్ కల్యాణ్ భద్రతపై జనసేన ఆందోళన

జనసేన అధినేత మరియు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భద్రతపై ఇటీవల వరుసగా చర్చలు జరుగుతున్నాయి. వై ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ, పవన్‌కు ఎదురైన కొన్ని Read more

Sam Altman : ఓపెన్ ఏఐ సీఈవో ను ఏపీకి ఆహ్వానించిన చంద్రబాబు
Sam Altman ఓపెన్ ఏఐ సీఈవో ను ఏపీకి ఆహ్వానించిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దిగ్గజ సంస్థ ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌ను అమరావతికి ఆహ్వానించారు. రాష్ట్రంలో ఏఐ ఆధారిత అభివృద్ధికి Read more

ఇరాన్ తో సంబంధాలపై ట్రంప్ కొత్త దృష్టి
musk iravani

ప్రముఖ బిలియనియర్ ఎలాన్ మస్క్, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఇరాన్-అమెరికా సంబంధాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. మస్క్ ఇటీవల ఇరాన్ యునైటెడ్ Read more

×